తెలంగాణ

telangana

రాజకీయాల్లో మహిళామణులు.. వాటా పెరుగుతోందా? తగ్గుతోందా?

By

Published : May 16, 2021, 12:37 PM IST

ఏదైనా చెప్పాలనుకుంటే మగవాళ్లతో చెప్పు.... ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఆడవాళ్లతోనే చెప్పు.. అంటుంది ఐరన్‌ లేడీ మార్గరెట్‌ థాచర్‌. రాజకీయాల్లో మన వాటా పెరుగుతోందా? తగ్గుతోందా? అన్న అంశాలు పరిశీలించాలని చెబుతున్నారు. బెంగాల్‌ బెబ్బులి మమత విజయం మనకి ఆనందమేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ స్ఫూర్తి ఎలా ఉంది? అనేది చూద్దాం...!

woman empowerment, woman in politics
చట్టసభల్లో మహిళలు, ప్రజాప్రతినిధుల్లో మహిళలు

ఏదైనా చెప్పాలనుకుంటే మగవాళ్లతో చెప్పు.... ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఆడవాళ్లతోనే చెప్పు.. అంటుంది ఐరన్‌ లేడీ మార్గరెట్‌ థాచర్‌. చేతల్లో మనమేంటో నిరూపించుకోవాలంటే రాజకీయాలను మించిన వేదిక లేదు. ఈ రంగంలో మన వాటా పెరుగుతోందా? తగ్గుతోందా? ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలనే తీసుకుందాం.. బెంగాల్‌ బెబ్బులి మమత విజయం మనకి ఆనందమే. మరి ఆ స్ఫూర్తి... అన్ని చోట్లా ఉందా?

11… కేరళలో మహిళలు కైవసం చేసుకున్న అసెంబ్లీ సీట్ల సంఖ్య ఇది. గత ఎన్నికల్లో ఇది 8. అంటే కాస్త పెరిగాయి! సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి, 21 ఏళ్ల వయసులోనే తిరువనంతపురం మేయర్‌గా ఎంపికై దేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన ఆర్యా రాజేంద్రన్‌ వంటి వారే ఈ మార్పునకు కారణం కావొచ్చు.


40… కాళీమాతను పూజిస్తూ స్త్రీశక్తికి ప్రాధాన్యత ఇచ్చే పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో గెలిచిన మహిళల సంఖ్య ఇది. ఈ సారి పెద్ద మార్పు లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో 41 మంది గెలిచారు మరి!


12 మంది... తమిళనాడు అసెంబ్లీలో కాలుపెట్టనున్న మహిళా ఎమ్మెల్యేలు. ఈసారి ఆ సంఖ్య ఆ బాగా తగ్గిపోయింది! పోయిన సారి 21 మంది విజేతలయ్యారు!


6… అసోం నుంచి ఆరుగురు మహిళలు అసెంబ్లీలో తమ గొంతు వినిపించనున్నారు. గతంలో ఈ సంఖ్య 8. పుదుచ్చేరిలో ఒకే ఒక్క మహిళ గెలిచారు.


ఈ సంఖ్య పెరిగేదెప్పుడు? చట్టాల రూపకల్పనలో మనకు తగిన ప్రాతినిధ్యం దక్కేదెప్పుడు?

ఇదీ చదవండి: 'హ్యాపీనెస్ కిట్'తో నెలసరి సమస్యలకు పరిష్కారం!

ABOUT THE AUTHOR

...view details