ఏపీలోని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కేవలం కృష్ణా జిల్లా వాసులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి నిత్యం వందలాదిగా వైద్యం కోసం తరలివస్తుంటారు. వివిధ రకాల వైద్యసేవలతో పాటు, ఏపీ కొవిడ్ ఆసుపత్రి కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రచార బోర్డు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
'జ్వరం, నీరసంగా ఉంటే ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లండి.. ఇక్కడికి రావొద్దు' - విజయవాడ ప్రభుత్వాసుపత్రి బోర్డు వివాదం
ఎవరికి ఏ చిన్న అనారోగ్యం తలెత్తినా వెంటనే ఆసుపత్రి గుర్తుకు వస్తుంది. డబ్బు ఉన్న వాళ్లైతే ప్రైవేటు ఆసుపత్రి వైపు వెళ్తారు. లేని వారు ప్రభుత్వాసుపత్రికి పరుగులు తీస్తారు. కానీ.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం జ్వరం, దగ్గు, నీరసంగా ఉంటే మీకు దగ్గర్లోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకైనా.. స్థానిక క్లినిక్‌కైనా వెళ్లండని అంటున్నారు.
Vijayawada notice board
'జ్వరం, దగ్గు, నీరసంగా ఉంటే మీకు దగ్గర్లోని ఆర్‌ఎంపీ వైద్యుడి దగ్గరకు కానీ, స్థానిక క్లినిక్‌కు కానీ వెళ్లండి. చిన్నవాటికి అనవసరంగా భయపడి పెద్దాసుపత్రికి రావద్దంటూ' బోర్డును విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర విభాగం ముందు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరితే తనకు తెలియదని, వెంటనే బోర్డు తొలగిస్తామని చెప్పడం గమనార్హం.