తెలంగాణ

telangana

ETV Bharat / city

సామాన్యుడు కుదేలు: కూరగాయల ధరలతో వంటింట సతమతం

కరోనా వేళ ఉపాధి అవకాశాలు లేక, వివిధ ఆదాయ మార్గాలూ తగ్గిపోయి ఆచితూచి ఖర్చుచేస్తున్న సామాన్యులు ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన కూరగాయల ధరలు చూసి విలవిల్లాడుతున్నారు. ఏవి తీసుకున్నా కిలో రూ.50కి తగ్గకుండా రూ.100 దరిదాపుల్లోకి ఎగసిపడుతుండటంతో వంటింటి బడ్జెట్‌ తలకిందులవుతోంది. అటు కష్టపడి పండించే రైతులు లాభపడుతున్నారా అంటే అదీ లేదు. దళారుల మాయాజాలం, రిటైల్‌ దోపిడీతో రైతులు, ఇటు వినియోగదారులు ఇబ్బందిపడాల్సిన పరిస్థితి.

vegetable price rise
కూరగాయల ధరలు

By

Published : Oct 6, 2020, 11:02 AM IST

కూకట్‌పల్లికి చెందిన మోహన్‌ కుటుంబంలో ఆరుగురు సభ్యులున్నారు. రోజుకు రెండు కిలోల కూరగాయలు అవసరం. ఆకుకూరలతో కలిపి నిత్యం రూ.100 వరకు ఖర్చయ్యేది. నెలకు రూ.3వేలు వెచ్చించేవారు. కూరగాయల ధరలు పెరిగి బడ్జెట్‌ మారింది. గతంలో మాదిరి వాడాలంటే నెలకు రూ.6 వేలు ఖర్చుపెట్టాల్సిన పరిస్థతి..

అవసరాలు తీర్చలేని పంటలు..

హైదరాబాద్​ నగరానికి ప్రస్తుతం 20 లక్షల కిలోల వరకు కూరగాయలు అవసరం. తెలంగాణలోని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నవి 30 శాతం మించడంలేదు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, పశ్చిమ్‌బంగ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ల నుంచి వస్తున్నాయి. వీటి రవాణాకు అయ్యే ఖర్చుతో ధరలూ పెరుగుతున్నాయి. మన రాష్ట్రంలో దిగుబడి తక్కువయ్యేసరికి అన్నీ ధరలు పెరిగిపోతున్నాయని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

రియల్‌ ఎస్టేట్‌కు తోడు ప్రత్యామ్నాయ పంటలు..

తంలో నగరానికి అవసరమైన కూరగాయల్లో సగం రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి వచ్చేవి. స్థిరాస్తి రంగం విస్తరణతో కూరగాయల విస్తీర్ణం తగ్గగా.. వరి, పత్తి సాగు పెరగడం విశేషం.

చిన్న కట్టలుగా అమ్ముతున్నారు..

రోనా కాలం నడుస్తున్న వేళ గతం కంటే ఎక్కువ కూరలు తిందామన్నా కుదరని పరిస్థితి. వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని చెప్పి ఆకుకూరలు చిన్న కట్టలుగా చేసి ఒక్కోటి రూ.5 నుంచి రూ.7 అమ్ముతున్నారు. కూరగాయలు కిలో రూ.60 లోపు దొరకని పరిస్థితి. కొద్దిగా కొనుక్కొని వండుకుంటున్నాం: రాధికా రెడ్డి, సికింద్రాబాద్‌

కిలో అంటే రూ.100..

తంలో రూ.100 పెడితే రెండు, మూడు రోజులకు సరిపడా కూరగాయలు తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు ఒక కిలోకే అంత ఖర్చవుతోంది. ఇదివరకు క్యారెట్‌, బీన్స్‌ ధరలు ఎక్కువగా ఉండి మిగతావి అందుబాటులో ఉండేవి. అలాంటిది బీర, కాకర, చిక్కుడు..ఇలా అన్నీ రూ.80-100 వరకు అమ్మేస్తున్నారు: డి.శిరీష, జగద్గిరిగుట్ట

కాలానుగుణంగా పండేవి తీసుకోవాలి..

ప్రతి ఒక్కరూ రోజుకు 350 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. 100 గ్రా.. తగ్గకుండా పండ్లు తినాలి. కాలానుగుణంగా పండినవి తీసుకుంటే సరిపోతుంది. బీర ధర ఎక్కువుంటే పొట్లకాయ తీసుకోవచ్ఛు దాదాపుగా అన్నింట్లో ఒకటే మాదిరి పోషకాలుంటాయి. రకరకాలు తింటే సరిపోతుంది: దమయంతి, ఎన్‌ఐఎన్‌ విశ్రాంత శాస్త్రవేత్త

రవాణా ఖర్చు జోడించి..

మాటా, క్యాబేజీ, బీట్‌రూట్‌, క్యారెట్‌ పండిస్తున్నాను. రైతుబజారుకు తీసుకువచ్చి మార్కెట్‌ అధికారులు నిర్ణయించిన ధరకు అమ్ముతున్నాం. మేము తీసుకువచ్చినందుకు ఖర్చు జోడించి ఈనెల 2న కిలో టమాటా రూ.26కి అమ్మాం. పొలం దగ్గర ఇదే టమాటా రూ.20 నుంచి 23కే దొరుకుతుంది. రైతుబజార్లు మరిన్ని విస్తరించాలి:విష్ణువర్థన్‌రెడ్డి, రైతు, చేవెళ్ల

ఇవీ చూడండి:'పరిహార సెస్సు గడువు పొడిగింపునకు అంగీకారం

ABOUT THE AUTHOR

...view details