రాష్ట్రంలో, జీహెచ్ఎంసీలో తెరాస గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేటీఆర్ అన్నారు. జుమ్మేరాత్ బజార్లో రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్... హైదరాబాద్‌లో ఇప్పుడు రౌడీలు, గుండాలు లేరని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఉంటే వార్త... ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో కంటైన్మెంట్ జోన్లు తిరిగి... కుటుంబానికి రూ.1,500, వరద బాధితులకు రూ.10 వేలు ఇచ్చాం. మిగిలిన వారికి డిసెంబర్ 7 తర్వాత ఇస్తామని స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంను తెరాస ఓడిస్తుందని... ఉద్వేగాలకు లోను కాకుండా ఓటేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో కడితే... రాష్ట్రానికి సగమే ఇచ్చిందన్నారు. దిల్లీ నుంచి పెద్ద వాళ్లు వస్తున్నారు... కేసీఆర్ మాత్రం సింహంలా సింగిల్‌గా వస్తున్నాడని వ్యాఖ్యానించారు. భాజపా వాళ్లు డొనాల్డ్ ట్రంప్‌ను కూడా తీసుకొచ్చేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.