భాజపా, ఎంఐఎంతో తెరాసకు మంచి అవగాహన ఉందని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆర్‌ఎస్ఎస్ వాళ్లు కవాతు పేరుతో కర్రలతో భయానక వాతావరణం సృష్టించారన్నారు.
'భాజపా, ఎంఐఎంకు ఓ న్యాయం.. మిగతా వాళ్లకో న్యాయమా?'
ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు కర్రలతో భారీ కవాతు నిర్వహిస్తామంటే బేషరతుగా అనుమతి ఇచ్చారు. నిజామాబాద్‌లో ముస్లింల భారీ ర్యాలీకి అనుమతి ఇచ్చారు. మేం శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామంటే.. ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు. - ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీ పీసీసీ అధ్యక్షుడు
ఉత్తమ్‌కుమార్ రెడ్డి,
భాజపా, ఎంఐఎంలకు ఇచ్చిన అనుమతి కాంగ్రెస్‌కు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఇతర పక్షాలు చిన్నసభలు పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని ఆక్షేపించారు. తాము అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహిస్తామంటే అనుమతి ఇవ్వకపోవడం సరికాదన్నారు.
రేపు కాంగ్రెస్ 135వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. నేతలు అన్ని జిల్లాల్లో జెండావిష్కరణ జరిపి 11 గంటలకు గాంధీ భవన్ చేరుకోవాలని పిలుపునిచ్చారు.