తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Jun 21, 2020, 8:58 PM IST

Updated : Jun 21, 2020, 10:54 PM IST

topten news @9PM
టాప్​టెన్​ న్యూస్​@9PM

అదే కారణం..!

సరిహద్దు విషయంలో చైనాతో పాటు నేపాల్​ కూడా భారత్​కు సవాళ్లు విసురుతోంది. అయితే చైనా అండతోనే నేపాల్​ భారత్​తో కయ్యానికి కాలుదువ్వుతోందని అనేక మంది భావిస్తున్నారు. ఇందులో నిజమెంత? నేపాల్​ అనూహ్య వైఖరితో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి సంబంధం ఉందా? నేపాల్​ను తక్కువ అంచనా వేయడమే ఇందుకు కారణమా?. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆదుకుంటాం..

గల్వాన్ లోయలో చైనా సైనికుల చేతిలో వీరమరణం పొందిన కర్నల్ సంతోశ్​ బాబు కుటుంబాన్ని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పరామర్శించారు. సూర్యాపేటలో సంతోశ్​ బాబు కుటుంబ సభ్యులను కలిసి కిషన్​ రెడ్డి... వారికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అలా మాట్లాడొచ్చా?

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వైద్యులపై చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు ఖండించారు. దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన జేపీ నడ్డా..కరోనాపై పోరాడుతోన్న వైద్యులను అవమానపరిచేలా మాట్లాడారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

గాంధీకి వెళ్లి శవమై తేలాడు..

మంగళహాట్​ పీఎస్ పరిధిలో నివసించే యువకుడు కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరి తప్పిపోయిన కేసును పోలీసులు ఛేదించారు. అతను చనిపోతే మృతదేహం మే31న రాత్రి 10 గంటల సమయంలో అనాథల మార్చరీకి చేర్చినట్లు రికార్డులో ఉందని మంగళహాట్ సీఐ రణ్వీర్ రెడ్డి తెలిపారు. మే 30 వ తేదీన కరోనా లక్షణాలతో ఉన్న నరేందర్​ సింగ్​ను గాంధీ హాస్పిటల్​లో చేర్పించినట్లు అతని కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఉగ్రపంజా..

బ్రిటన్​లోని ఓ​ పార్కులో విచక్షణా రహితంగా కత్తిపోట్లకు తెగబడ్డవారు ఉగ్రవాదులేనని స్పష్టం చేశారు పోలీసులు. ప్రస్తుతానికి రీడింగ్​ నగర వాసులు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్​ మృతి ఘటనకు, ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సీరియల్ కిల్లర్

సంచలన సీరియల్ కిల్లర్ 'సైనైడ్ మోహన్​'ను 20వ హత్య కేసులోనూ దోషిగా తేల్చింది కర్ణాటకలోని మంగళూరు న్యాయస్థానం. 2009లో కేరళ కాసర్​గోడ్​లో ఓ యువతిని మోసగించి, చంపింది అతడేనని నిర్ధరించింది. ఈనెల 24న 'సైనైడ్ మోహన్​'కు కోర్టు శిక్ష ఖరారు చేసే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

తండ్రే చంపితే..

ఫాదర్స్​ డే అని ఓ వైపు గొప్పగా సంబరాలు జరుపుకుంటుంటే.. దానికి విలువ లేకుండా చేశాడో తండ్రి. లాలించి, బుజ్జగించాల్సిన ఆ చేతులతో.. కన్న కూతురని చూడకుండా కొట్టి, మంచం పైనుంచి విసిరేశాడు. రెండు నెలలైనా నిండని ఆ పసిపాప.. ఇప్పుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రెండుసార్లు ఔట్ ఇచ్చా..

అంతర్జాతీయ క్రికెట్​లో వివాదాస్పద అంపైర్​గా పేరుతెచ్చుకున్న స్టీవ్​ బక్నర్​.. గతంలో ఇచ్చిన తప్పుడు నిర్ణయాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సచిన్​ను రెండుసార్లు ఎల్బీ, క్యాచ్​ ఔట్​గా ప్రకటించినట్లు ఒప్పుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'మంచు' యోగా..

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు నటీనటులు వివిధ యోగాసనాలను ప్రదర్శిస్తూ అభిమానుల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా హైదరాబాద్​లోని తన నివాసంలో నటి, నిర్మాత మంచు లక్ష్మి యోగా చేశారు. తన దినచర్యలో వ్యాయామం ఒక భాగమని ఈ సందర్భంగా తెలిపారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా తోడ్పడుతుందని ఆమె వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అమృత-ప్రణయ్ ఫస్ట్​లుక్​

ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా ప్రణయ్​ను దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దీని ఆధారంగా చేసుకుని రామ్​గోపాల్​ వర్మ పర్యవేక్షణలో ఓ చిత్రానికి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను ఆర్జీవీ సోషల్​మీడియాలో ఆదివారం విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Last Updated : Jun 21, 2020, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details