తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @1PM - టాప్‌టెన్ న్యూస్

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top news, telangana news
టాప్‌న్యూస్, తెలంగాణ వార్తలు

By

Published : Jun 15, 2021, 12:55 PM IST

Updated : Jun 15, 2021, 1:22 PM IST

  • గర్వమే ఎక్కువ..

గాల్వన్​ లోయ ఘర్షణలో కర్నల్ సంతోశ్​బాబు ప్రాణాలు కోల్పోయి నేటికి ఏడాది పూర్తవుతోంది. సంతోశ్​ బాబు మరణంతో తన కుటుంబంలో విషాదం నిండినా.. వారిలో బాధ కన్నా.. దేశం కోసం ప్రాణాలొదిలాడన్న గర్వమే ఎక్కువగా కనబడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నారసింహుని సేవలో సీజేఐ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(cji nv ramana) దంపతులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని (yadadri temple) దర్శించుకున్నారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అమర వీరులకు నివాళి

తూర్పు లద్ధాఖ్​లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యాల మధ్య పెను ఘర్షణ జరిగి నేటికి ఏడాది. ఈ సందర్భంగా గల్వాన్​లో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించింది భారత సైన్యం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • డీజే ఆపాడని ట్రైనీ ఎస్సైపై దాడి

నల్గొండ జిల్లా డిండి మండలం బురాన్​పూర్ తండాలో దారుణం చోటుచేసుకుంది. పెట్రోలింగ్​లో భాగంగా.. సోమవారం రాత్రి బురాన్​పూర్ తండా వెళ్లిన పోలీసులు.. ఓ వివాహ వేడుకలో కొందరు యువకులు గుంపులు గుంపులుగా చేరడాన్ని గమనించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భగ్గుమంటున్న డీజిల్ ధరలు

డీజిల్ ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గడిచిన వారం రోజుల్లో నాలుగు సార్లు పెరిగాయి. పెరిగిన ఇంధన ధరలతో లారీల నిర్వహణ యాజమాన్యానికి భారంగా మారుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ట్విట్టర్​కు సమన్లు

సామాజిక మాధ్యమం ట్విట్టర్​కు ఇన్​ఫర్మేషన్​ అండ్ టెక్నాలజీ విభాగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న సాయంత్రం 4లోపు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. డిజిటల్‌ వేదికల్లో పౌరుల హక్కుల రక్షణపై ట్విట్టర్​ను ప్రశ్నించనుంది కమిటీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తుపాకీతో హల్​చల్​

పట్టపగలు అందరూ చూస్తుండగా కొంతమంది దుండగులు ఓ వ్యాపారిపై కాల్పులకు పాల్పడిన ఘటన రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చింది. కోటా గుమన్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కూరగాయల మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అప్పులు చేయాల్సి వస్తోందా?

చాలా మంది నెల జీతం రాగానే ఉదారంగా ఖర్చు చేసి రాజులా గడుపుతారు.. నెలాఖరు వచ్చే సరికి మళ్లీ అప్పు కోసం చూస్తారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఖర్చులను ఎలా ప్లాన్​ చేసుకోవాలి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కోచ్​పై క్లారిటీ​..

లంక పర్యటన(IND Vs SL)​లో టీమ్ఇండియా కోచ్​గా మాజీ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్‌(Rahul Dravid) వ్యవహరిస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. దాదాపుగా బీసీసీఐ వర్గాలూ అనేకసార్లు దీన్ని స్పష్టం చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లెక్కలు మార్చిన డైరెక్టర్‌

తెలుగు చిత్రసీమలో స్టార్​ హీరోలతో సూపర్​హిట్​ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ. కమర్షియల్‌ అంశాలకు సందేశాన్ని జోడించి సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Last Updated : Jun 15, 2021, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details