తెలంగాణ

telangana

By

Published : May 24, 2021, 4:59 PM IST

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్‌టెన్‌ న్యూస్‌ @5PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @5PM

  • సీఎం సమీక్ష..

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ అమలు తీరుపై అధికారులతో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • '18 ప్లస్​'కు టీకా కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్​!

18 నుంచి 44 ఏళ్లవారికి కొవిడ్ టీకా కోసం.. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల వద్దే కొవిన్​ పోర్టల్​లో నమోదుకు అనుమతిస్తూ కేంద్రం ప్రకటన జారీ చేసింది. వ్యాక్సిన్ల వృథాను తగ్గించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎమ్మెల్యే తమ్ముడినంటూ హంగామా..!

పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులకు.. ఓ వ్యక్తికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లాక్​డౌన్​ నిబంధనలకు విరుద్ధంగా.. చర్లబుత్కూర్ గ్రామం వైపు నుంచి వస్తోన్న ఓ కారును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వాహనదారుడు పోలీసులపై విరుచుకుపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాష్ట్రానికి వర్షసూచన..

రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ సంచాలకులు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం..

హైదరాబాద్ మంగళ్​హాట్ ఠాణా పరిధిలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై ఇంటి యజమాని అత్యాచారానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరో గ్యాస్ పైప్ లైన్ లీక్..

ఏపీ విశాఖ జిల్లా పరవాడ మండలంలోని అనన్య అమ్మోనియా కంపెనీలో ప్రమాదం జరిగింది. సంస్థను తక్షణం మూసివేయాలని స్థానికులు ధర్నా చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కేంద్రానికి కీలక ఆదేశాలు!

కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు పరిహారం అందించడంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు అఫిడవిట్​ దాఖలు చేయలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పెరిగిన బంగారం, వెండి ధరలు..

పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర సోమవారం దాదాపు రూ.100 పెరిగింది. వెండి ధర కిలో రూ.71 వేలకు చేరువైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పాండ్య సోదరుల దాతృత్వం..

కరోనాతో పోరాడుతున్న బాధితులకు సాయం అందించేందుకు మరోసారి ముందుకొచ్చారు క్రికెటర్లు పాండ్య సోదరులు. మరికొన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పోలీస్​ ఆఫీసర్​గా ఫహాద్​!

లోకనాయకుడు కమల్​ హాసన్​ - లోకేశ్​ కనగరాజ్​ దర్శకత్వంలో 'విక్రమ్'​ సినిమా రూపొందుతోంది. ఇందులో మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​ ఓ కీలకపాత్రలో నటించనున్నారని ఇదివరకే ప్రకటన వచ్చింది. అయితే ఆయన పోషించే పాత్రపై ఓ ఆసక్తికర అప్​డేట్​ బయటకొచ్చిందని కోలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details