తెలంగాణ

telangana

By

Published : Nov 13, 2020, 4:58 PM IST

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @5PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @5PM

  • కేబినెట్ భేటీ ప్రారంభం..

గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలు, సన్నాలు పండించిన రైతులకు బోనస్ ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో జీహెచ్​ఎంసీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీఎం దీపావళి శుభాకాంక్షలు..

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అజ్ఞానాంధకారాలను తొలగించి విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలని ముఖ్యమంత్రి వేడుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • గుడిలోకి ప్రవేశంలేదు..

ఆధునిక పరిజ్ఞానం పెరుగుతున్న ప్రస్తుత కాలంలోనూ... కులాల వారిగా నిబంధనలు పెడుతున్నారు. అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న ఈ రోజుల్లో సైతం... కొన్ని కులాల వారిని ఆలయాల్లో ప్రవేశించరాదని ఆపేస్తున్నారు. ఫలానా కులం వారికి దేవాలయాల్లో పూజలు చేయమని నిరాకరిస్తూ... వర్గ విభేదాలు రెచ్చగొడుతున్నారు. ఈ అమానవీయ ఘటన జనగామలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అత్యాధునిక బస్​షెల్టర్లు..

హైదరాబాద్​ దిల్​సుఖ్​నగర్​లో నూతనంగా నిర్మించిన ఆరు ఆధునిక బస్​షెల్టర్లను మేయర్ బొంతు రామ్మోహన్​ ప్రారంభించారు. హైద‌రాబాద్​లో అత్యాధునిక హంగుల‌తో వెయ్యి బ‌స్ షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్​ పేర్కొన్నారు. అత్యాధునిక బ‌స్‌షెల్టర్లను ఏర్పాటు చేయ‌డం ద్వారా... ప్రముఖ న‌గ‌రాల్లో మాదిరిగా హైదరాబాదీలకు మెరుగైన సౌక‌ర్యం ఏర్పడుతోంద‌ని మేయ‌ర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 6 రాష్ట్రాలకు విపత్తు సాయం..

ప్రకృతి విపత్తులతో తీవ్రంగా నష్టపోయిన ఆరు రాష్ట్రాలకు సాయం కింద త్వరలోనే రూ.4,382 కోట్లు విడుదల చేయనుంది కేంద్రం. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. ఇందులో బంగాల్​, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, సిక్కిం ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పాకిస్థాన్​ కాల్పుల్లో ఎస్సై మృతి..

పాకిస్థాన్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్​స్పెక్టర్​ రాకేష్ మృతి చెందినట్లు భారత ఆర్మీ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చేపల దిగుమతులు నిలిపేసిన చైనా..

చేపల్లో కరోనా వైరస్​ను గుర్తించటం వల్ల భారత్​కు చెందిన బసు ఇంటర్నేషనల్​ కంపెనీ నుంచి దిగుమతులను చైనా తాత్కాలికంగా నిలిపివేసింది. గడ్డకట్టింటిన కటిల్​ఫిష్​ ప్యాకేజీలో మూడు శాంపిల్స్​లో వైరస్​ ఉన్నట్లు కస్టమ్స్​ అధికారులు గుర్తించారని రాయిటర్స్​ వార్త సంస్థ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వారాంతంలో మార్కెట్లకు లాభాలు..

ఆరంభ ఒడుదొడుకుల నుంచి తేరుకుని చివరకు లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ స్వల్పంగా 86 పాయింట్లు పెరిగి..43,400పైకి చేరింది. నిఫ్టీ 29 పాయింట్ల స్వల్ప లాభంతో సెషన్​ను ముగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అలా చేస్తే బెటర్..

వచ్చే ఐపీఎల్​లో ధోనీ, కేవలం ఆటగాడిగానే కొనసాగాలని చెప్పిన మాజీ కోచ్ సంజయ్ బంగర్.. కెప్టెన్సీని వేరే ఆటగాడికి ఇవ్వాలని సూచించాడు. వచ్చే సంవత్సరం ఏప్రిల్-మే మధ్యలో లీగ్​ను​ నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అభిమానుల విజిల్స్..

భారత చిత్రసీమలో బయోపిక్​లా హవా నడుస్తోంది. సినీ ప్రేక్షకులు ఈ తరహా చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. అయితే బాలీవుడ్​లో ఇప్పటివరకు వచ్చిన కొన్ని స్టార్​ క్రీడాకారుల బయోపిక్​లు ఏంటి? వాటిలో ఎవరు నటించారు? అభిమానుల నుంచి ఎలాంటి స్పందన లభించింది? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details