తెలంగాణ

telangana

By

Published : Nov 12, 2020, 4:59 PM IST

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @5PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @5PM

  • సీఎం భేటీ..

దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఉపసభాపతి పద్మారావుగౌడ్, తెరాస ప్రధాన కార్యదర్శులతో సీఎం ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు. దుబ్బాకలో ఓటమికి కారణాలపై పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రఘునందన్​రావు పిటిషన్..

దుబ్బాక ఉపఎన్నికల సమయంలో సిద్దిపేటలో చోటుచేసుకున్న ఘటనపై భాజపా అభ్యర్థి రఘునందన్​రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనలో నమోదైన ఎఫ్​ఐఆర్​ కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన బంధువుల ఇంట్లో రూ.18 లక్షలు లభించాయని కట్టుకథ అల్లారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎన్నికల కమిషనర్ సమావేశం..

రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి సమావేశమయ్యారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల నిర్వహణ గురించి చర్చించారు. ఎన్నికల నిర్వహణ కోసం పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గేట్ వద్ద ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది..

దుబ్బాక ప్రజలు తెరాసకు కర్రు కాల్చి వాత పెట్టారని... భాజపా నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. బిహార్, పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు విపక్షాలకు చెంపపెట్టు లాంటివన్నారు. మోదీపై విమర్శలు మానుకొని... కాంగ్రెస్ తమ ఇంటిని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సీఎంగా నితీశ్​ ప్రమాణం ఎప్పుడంటే..!

బిహార్​లో ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక మిగిలింది ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారమే. అయితే ఈ వేడుక సోమవారం జరిగే అవకాశముంది. భాయ్ దూజ్​ పండుగ సందర్భంగా నితీశ్​కుమార్​ సీఎం బాధ్యతలు చేపట్టనున్నట్టు జేడీయూ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ట్రేడింగ్ సంస్థ గుట్టు రట్టు..

చెన్నైకు చెందిన ప్రముఖ బులియన్​ ట్రేడింగ్​ సంస్థలో రూ.500 కోట్లకుపైగా పన్ను పరిధిలోకి రాని ఆదాయాన్ని గుర్తించినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. అందులో రూ.150 కోట్ల ఆదాయాన్ని ఆ సంస్థే స్వచ్ఛందంగా వెల్లడించినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బడులు తెరవడంపై వెనక్కి..

నవంబర్​ 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలన్న నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకున్నాక మేరకు ఈ చర్యలు తీసుకుంది. అయితే, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు యథావిధిగా డిసెంబర్​ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మాకు దక్కిన గౌరవం..

టీ20 ప్రపంచకప్​ను భారత్​లో నిర్వహించడం తమకెంతో గర్వకారణమని బీసీసీఐ అధ్యక్షుడు​ గంగూలీ అన్నాడు. టోర్నీ నిర్వహణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నటుడు ఆత్మహత్య..

ఈ మధ్య కాలంలో బాలీవుడ్​లో ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. గురువారం సీనియర్ నటుడు అసిఫ్ బస్రా ఉరి వేసుకుని తుదిశ్వాస విడిచారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details