తెలంగాణ

telangana

By

Published : Nov 9, 2020, 5:01 PM IST

ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @5PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @5PM

  • మార్కెట్లకు కొత్త 'జో'రు..

అంతర్జాతీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు బలపడి జీవన కాల గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ 197 పాయింట్ల లాభంతో తాజా గరిష్ఠాలను నమోదు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రంగు మారిన ధాన్యాన్నీ కొంటాం..

రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. రైస్ మిల్లర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి... రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మంత్రి కన్నీళ్లు..

జవాన్​ మహేష్ మృతి పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మహేష్ కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంత్యక్రియలకు అయ్యే ఖర్చులు తానే భరిస్తానని... ఏర్పాటు చేయాలని గ్రామ కమిటీ సభ్యులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం..

విపత్తులు సంభవించినప్పుడు ఏంచేయాలో ప్రధాని మోదీ చూసి నేర్చుకోవాలని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​.. కేటీఆర్​కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గంపగుత్తగా రాజీనామా చేస్తామంటే కేంద్రం.. రాష్ట్రానికి అదనంగా ఇచ్చిన నిధులపై చర్చకు సిద్దమని అర్వింద్​ సవాల్ విసిరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చెత్త నుంచి విద్యుత్​ ఉత్పత్తి కేంద్రం..

హైదరాబాద్​లో నిర్మించిన చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు ప్రారంభానికి ముహూర్తం ఖరారయింది. జవహర్​నగర్​లో నిర్మించిన ప్లాంటును మంగళవారం... మంత్రి కేటీఆర్​ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • జేఎన్టీయూలో స్పాట్​ అడ్మిషన్లు ప్రారంభం..

హైదరాబాద్‌లోని జ‌వ‌హర్‌లాల్ నెహ్రు టెక్నాల‌జిక‌ల్ యూనివ‌ర్సిటీ (జేఎన్‌టీయూ)లో​ ఆడ్మిషన్​లు ప్రారంభమైనట్లు అధికారిక వెబ్​సైట్​లో ప్రకటించారు. బీటెక్​ స్పాట్​ ఆడ్మిషన్​లు ప్రారంభమైనట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 101 కిలోల వెండితో తులాభారం..

గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్​ పాటిల్​కు​ సూరత్​లో వెండి తులాభారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన 101 కిలోల వెండిని స్వచ్ఛంద సేవా సంస్థలకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • శూరున్ని కోల్పోవడం బాధాకరం..

జమ్ముకశ్మీర్​ ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన రాడ్యా మహేశ్​కు‌ హిమాచల్​ ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. మహేశ్​ తండ్రితో ఫోన్​లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సన్​రైజర్స్​కు దొరికిన ఆణిముత్యం..

సన్​రైజర్స్​ హైదరాబాద్ ఈసారి తుదిపోరుకు చేరుకోలేకపోయినప్పటికీ​, జట్టులోని యువ ఆటగాళ్ల ప్రదర్శనకు మంచి మార్కులే పడ్డాయి. యార్కర్​ స్పెషలిస్టు టి.నటరాజన్​ తన బౌలింగ్​తో అందరి దృష్టిని ఆకర్షించాడు. పలువురు మాజీలు కూడా ఇతడు సన్​రైజర్స్​కు దొరికిన అద్భుత బౌలర్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మారేడిమిల్లిలో అల్లు అర్జున్..

'పుష్ప' సినిమా చిత్రీకరణలో భాగంగా హీరో అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి చేరుకున్నారు. రేపటి నుంచి షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details