తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS

By

Published : Jul 20, 2022, 8:58 PM IST

  • ఎఫ్‌సీఐ నిబంధనలను తెలంగాణ పట్టించుకోవడం లేదు: గోయల్‌

తెలంగాణలో ధాన్యం, బియ్యం సేకరణకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ధాన్యం సేకరణపై ఎఫ్​సీఐ క్లియరెన్స్​ ఇస్తుందని ఆయన వెల్లడించారు. పేదలకు సాయం చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పని చేస్తోందని పేర్కొన్నారు. పేదలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదన్నారు.

  • 'పోలవరం వల్ల లక్ష ఎకరాల వరకు మునిగిపోతాయి..'

ఏపీలో నిర్మించే పోలవ‌రం ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ల‌క్ష ఎక‌రాల పొలాలతో పాటు చారిత్రక ప్రదేశాలకు ముప్పు నెలకొంటుందని రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఆరోపించారు. ఆదిలాబాద్‌లో వందేళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైనందునే.. కడెం ప్రాజెక్టుకు నష్టం జరిగింది తప్పితే.. ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

  • ఒకే రోజు 53 సంస్థల‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం.. ల‌క్షన్నర మందికి ఉపాధి..

టీ-హబ్ 2.0లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ నాలెడ్జ్(టాస్క్) కార్పొరేట్ ఒప్పంద కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒకే రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 53 సంస్థల‌తో ఒప్పందాలు చేసుకుంది.

  • 'చిరంజీవిని అన్నందుకు పశ్చాత్తాప్పడుతున్నా.. ఇక వదిలేయండి..'

చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను అన్న మాటలను భాషాదోషంగా పరిగణించాలని చిరంజీవి అభిమానులకు నారాయణ విజ్ఞప్తి చేశారు.

  • 'కృష్ణా బోర్డుకు మరో లేఖ.. ఆ పనుల పరీశీలనకు బృందాన్ని పంపండి'

ఆర్డీఎస్ కుడికాల్వ పనులపై కృష్ణా బోర్డుకు తెలంగాణ మరో లేఖ రాసింది. ఆర్డీఎస్ పనుల పరిశీలన కోసం బృందాన్ని పంపాలని ఈఎన్సీ మురళీధర్ లేఖలో కోరారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ఏపీ పనులు కొనసాగిస్తోందని వెల్లడించారు.

  • జేఈఈ మెయిన్​ రెండో విడత పరీక్షలు​ వాయిదా..

జేఈఈ మెయిన్​ రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త పరీక్ష తేదీలను బుధవారం ప్రకటించింది నేషనల్​ టెస్టింగ్​ ఏజన్సీ. జులై 25 నుంచి నిర్వహించనున్నట్లు తెలిపింది.

  • ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన 13 భవనాలు.. అధికారుల వార్నింగ్​!

జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మిక వరదల ధాటికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. నదీ మట్టాలు ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయని ఎప్పుడు వరదలు వస్తాయో చెప్పలేమని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

  • సవాళ్ల లంకకు సారథిగా రణిల్.. ద్వీపదేశం గట్టెక్కేనా?

తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రణిల్ విక్రమసింఘె(73). బుధవారం పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించగా.. మెజార్టీ సభ్యులు రణిల్​కే మద్దతు పలికారు.

  • ఈ సక్సెస్​ మంత్రతో ముందుగు సాగండి- కామన్​వెల్త్​ అథ్లెట్లకు మోదీ దిశానిర్దేశం

కామన్​వెల్త్​ గేమ్స్​-2022లో పాల్గొనే భారత క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు క్రీడాకారులకు సక్సెస్​ మంత్రను బోధించారు మోదీ. కొందరు క్రీడాకారుల అనుభవాలను మోదీ తెలుసుకున్నారు.

  • 'బింబిసార' ఎన్టీఆర్​ రివ్యూ.. సినిమా అదిరిపోయిందన్న యంగ్​ టైగర్​!

అన్న కళ్యాణ్​రామ్ నటించిన 'బింబిసార' స్పెషల్​ ప్రివ్యూను యంగ్ టైగర్​ ఎన్టీఆర్ వీక్షించారని తెలిసింది. సినిమా అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్​పై ప్రశంసలు కురిపించారట. మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారని తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details