తెలంగాణ

telangana

ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA

By

Published : Feb 9, 2022, 2:57 PM IST

  • ప్రధాని వ్యాఖ్యలపై తెరాస నిరసనల హోరు..

TRS Protest against PM Comments : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెరాస ఆందోళనలు చేపట్టింది. ప్రధాని వ్యాఖ్యల పట్ల నిరసనలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రధాని మాట్లాడారని నేతలు మండిపడుతున్నారు.

  • తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ..

Clash between TRS and BJP: ఆంధ్రప్రదేశ్​ విభజనపై పార్లమెంట్​లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెరాస, కాంగ్రెస్ పార్టీలు భాజపాపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనగామ చౌరస్తాలో కాంగ్రెస్, తెరాస ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని భాజపా శ్రేణులు అడ్డుకోవటంతో ఉద్రిక్తతకు దారితీసింది.

  • హ్యాకింగ్ కేసులో మరో ఆరుగురు అరెస్టు..

Mahesh Bank Server Hacking Case: మహేశ్‌ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో మరో ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు నైజీరియన్లు సహా మరో నలుగురు అరెస్టయ్యారు. సైబర్ నేరగాళ్లకు నిందితులు బ్యాంకు ఖాతాలు సమకూర్చినట్లు తెలుస్తోంది. మహేశ్‌ బ్యాంక్‌ కేసులో ఇప్పటివరకు 14 మంది అరెస్టయ్యారు.

  • మహా ప్రభుత్వాన్ని కూల్చమన్నారు..

Sanjay Raut News: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొందరు తనను సంప్రదించారని తెలిపారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్​. లేకపోతే జైలుకు పంపిస్తామని బెదిరించారని ఆరోపించారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు.

  • తేయాకు వ్యర్థాలతో వరల్డ్​ రికార్డ్​..

tea fluff artist: కాదేదీ కవితకు అనర్హం అనే సామెతను చక్కగా వంటబట్టించుకున్న ఓ యువతి.. కాదేదీ కళకు అనర్హం అనేలా చేసి చూపించింది. తేయాకును శుద్ధి చేయగా మిగిలిన వ్యర్థాలతో.. వివిధ సంస్థల లోగోలు తయారు చేసి యురేషియా వరల్డ్​ రికార్డ్​ సృష్టించింది. ఆమెనే ఉత్తర్​ప్రదేశ్​, వారణాసికి చెందిన రోష్ని యాదవ్​​.

  • మహిళా డీఎస్​పీకి ఆకతాయిల వేధింపులు..

Woman DSP Molested: మహిళా డీఎస్​పీపై కొందరు ఆకతాయిల వేధింపుల ఉదంతం ఝార్ఖండ్​ రాంచీలో వెలుగుచూసింది. ఆ యువకులకు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా సహకరించినట్లు ఆమె ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • కాబుల్​ దాడి సూత్రధారి కోసం అమెరికా వేట..

అఫ్గానిస్థాన్​లోని కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గతేడాది బాంబు పేలుళ్లకు కారణమైన ఐసిస్-కె నాయకుడు షనాల్లా గఫారీ ఆచూకీ తెలిపిన వారికి భారీ నజరానా ప్రకటించింది అమెరికా. 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.75 కోట్లు) ఇస్తామని తెలిపింది.

  • కొవిడ్​కు కొత్త మందు..

Glenmark nasal spray for covid: కొవిడ్​ చికిత్సకు దేశీయంగా మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఫ్యాబీస్ర్పే పేరుతో ముంబయికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం గ్లెన్​మార్క్​ నాజల్​ స్ప్రేని మార్కెట్​లోకి విడుదల చేసింది. కెనడాకు చెందిన సానోటైజ్​ అనే భాగస్వామ్య కంపెనీతో కలిసి దీనిని రూపొందించింది.

  • అహ్మదాబాద్​ జట్టు ఇక 'గుజరాత్ టైటాన్స్'..

IPL Gujarat titans: హార్దిక్ పాండ్య కెప్టెన్​గా వ్యవహరించే కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ అని పేరు పెట్టారు. 'శుభ్ ఆరంభ్' అని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు.

  • కాజల్​పై బాడీ షేమింగ్ కామెంట్స్​..

జీవితం, పని ప్రదేశంలో అందరూ కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తుంటే ఇంకా మీరు బాడీ షేమింగ్ దగ్గరే ఉండిపోతున్నారని నెటిజన్లపై ప్రముఖ నటి కాజల్ మండిపడింది. ఈ మేరకు ప్రెగ్నెన్సీ గురించి, తనపై వస్తున్న కామెంట్స్​ గురించి పెద్ద పోస్ట్ పెట్టింది.

ABOUT THE AUTHOR

...view details