తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Top News: టాప్​న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS

By

Published : Aug 6, 2022, 8:58 PM IST

  • భారత ఉపరాష్ట్రపతిగా జగ్​దీప్​ ధన్​ఖడ్.. ఆళ్వాపై ఘనవిజయం

భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి జగ్​దీప్‌ ధన్‌ఖడ్ ఎన్నికయ్యారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

  • 'కేంద్రం వైఖరి సరిగా లేదు.. నీతిఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా..'

రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందుకు నిరసనగా.. రేపు దిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇది చాలా బాధాకరమే అయినప్పటికీ.. ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు వివరించారు.

  • కేసీఆర్ వ్యాఖ్యలపై నీతిఆయోగ్ స్పందన...

సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై నీతిఆయోగ్‌ స్పందించింది. నీతిఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించటం దురదృష్టకరమని సంస్థ పేర్కొంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం బహిష్కరణ సరికాదని తెలిపింది. బలమైన రాష్ట్రాలు, దేశం తయారు చేయటమే సంస్థ లక్ష్యమని వెల్లడించింది.

  • నీతిఆయోగ్‌ సమావేశానికి కేసీఆర్ వెళ్లకపోతే.. మోదీకి లొంగినట్లే: రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాలకు హాజరు అవ్వడం లేదని ప్రకటించడంపై పీసీసీ రేవంత్‌ మండిపడ్డారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరై మోదీని కేసీఆర్‌ నిలదీయాలని సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై ప్రశ్నించాలని కోరారు.

  • కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి అద్దంకి దయాకర్​ క్షమాపణలు..

నిన్న చండూరు సభలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి అద్దంకి దయాకర్​ క్షమాపణలు చెప్పారు. మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటానని తెలిపారు.

  • క్యాసినో వ్యవహారంలో ఆ ఎమ్మెల్యేల పాత్ర.. ఈడీ నోటీసులిచ్చే అవకాశం..

రాష్ట్రంలో సంచలనంగా మారిన క్యాసినో వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ అధికారులు.. ఈ కేసులో ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతుందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఏజెంట్​ చీకోటి ప్రవీణ్​కు విచారిస్తున్న అధికారులకు అతడి చరవాణీలో పలువురు ఎమ్మెల్యేల నెంబర్లు దొరికాయి.

  • పోలీస్​స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి.. కానిస్టేబుల్‌పై మూక దాడి.. ఏం జరిగింది?

పోలీస్​స్టేషన్​లోకి చొరబడి హెడ్​కానిస్టేబుల్​ను చితకబాదింది ఓ అల్లరిమూక. జులై 31న దిల్లీ.. ఆనంద్​విహార్​ స్టేషన్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దాడికి పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు డీసీపీ సత్యసుందరం వెల్లడించారు. అసలేం జరిగిందంటే?

  • పడవలో చెలరేగిన మంటలు.. ఐదుగురు కూలీలు దుర్మరణం

బిహార్​లో ఘోర ప్రమాదం జరిగింది. పట్నా రాంపుర్​ దియరా ఘాట్​ వద్ద ఓ పడవలో మంటలు చెలరేగాయి. సోన్​ నదిలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. బోటులోని డీజిల్​ డబ్బాల సమీపంలో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

  • కామన్వెల్త్​ క్రికెట్​ ఫైనల్లో భారత్​ మహిళా జట్టు.. పతకం ఖాయం

కామన్వెల్‌లో తొలిసారి జరుగుతున్న మహిళల క్రికెట్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 160/6 స్కోరుకే పరిమితం చేసి నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లో అడుగు పెట్టింది. దీంతో పతకం ఖాయం చేసుకుంది.

  • అనుష్క పోషించిన ఆ పాత్ర చేయాలని ఉంది: కృతిశెట్టి

తన డ్రీమ్​ రోల్​ ఎంటో చెప్పింది యువ హీరోయిన్​ కృతిశెట్టి. హీరో నితిన్​పై తనకున్న అభిప్రాయాన్ని తెలిపింది. అలానే ఆయనతో కలిసి నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా గురించి పలు విశేషాలను తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details