మావోయిస్టుల ఏరివేతలో భాగంగాఛత్తీస్గఢ్ పోలీసులు 'ఆపరేషన్ ప్రహార్' పేరిట గాలిపంపు చర్యలను ముమ్మరం చేశారు. అప్రత్తమైన రాష్ట్ర పోలీసులు సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని సరిహద్దు అటవీ ప్రాంతాలపై నిఘా పెట్టారు. అవసరాన్ని బట్టి అనుభవమున్న క్షేత్రస్థాయి పోలీస్ అధికారులతో పాటు శిక్షణ ఐపీఎస్లనూ రంగంలోకి దించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండటంతోపాటు ఇన్ఫార్మర్ వ్యవస్థను వినియోగించుకుంటూ సాయుధుల కదలిక పసిగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఉనికి చాటుకునే ప్రయత్నంలో మావోయిస్టులు తరచూ గోదావరి నది దాటి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముందని ఇక్కడి పోలీస్ అధికారులు బలంగా విశ్వసిస్తున్నారు. దీనికితోడు వేసవికాలం కావడం వల్ల నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో రాకపోకలు సులభం ఉంటుందని నిఘా విస్తృతం చేశారు.
నీలాద్రిపేట గుట్టను జల్లెడ పట్టిన బలగాలు
ఇటీవలి కాలంలో తొలిసారిగా తెలంగాణలోకి అడుగు పెట్టిన మావోయిస్టులకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దళాల సంచారం ఉందనే పక్కా సమాచారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు సోమవారం కూంబింగ్ చేపట్టి నీలాద్రిపేట గుట్టను జల్లెడ పట్టాయి. కూంబింగ్ గురించి సమాచారం అందడం వల్ల మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయారు.