రాష్ట్ర శాసనమండలి(telangana legislative council)లో స్థానిక సంస్థల కోటా(telangana mlc elections 2021)లో తొమ్మిది ఉమ్మడి జిల్లాల పరిధిలో ఖాళీ కానున్న 12 స్థానాల ఎన్నికల నేపథ్యంలో రెండు కమిటీలను నియమిస్తూ ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్(telangana CEO Shashank goel) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఎన్నికల సందర్భంగా చెల్లింపు కథనాలు, ప్రకటనలను పర్యవేక్షించడానికి వేర్వేరుగా రెండు కమిటీలను నియమించారు.
చెల్లింపు కథనాలను గుర్తించే కమిటీకి ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ ఛైర్మన్‌గా, అదనపు ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి సభ్యకార్యదర్శిగా, డాక్టర్ పి.మానస్ కృష్ణకాంత్, డాక్టర్ కె.స్టీవెన్‌సన్, వి.గాయత్రి, ఎం.ఏ.మాజిద్, ఎం.మాధవాచార్య సభ్యులుగా ఉంటారు.
ఎన్నికల(local body mlc elections telangana 2021) సందర్భంగా రాజకీయ పార్టీలు వివిధ మాధ్యమాల్లో ఇచ్చే ప్రకటనలను పర్యవేక్షించేందుకు నియమించిన కమిటీకి ఎన్నికల సంఘం అదనపు ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి ఛైర్మన్‌గా, సహాయ ముఖ్య ఎన్నికల అధికారి సభ్య కార్యదర్శిగా, వి.గాయత్రి, ఎం.బాబూరావు, ఎం.ఎస్.లక్ష్మి, ఎం.మాధవాచార్య సభ్యులుగా ఉంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ 12 స్థానాలకు వచ్చే నెల పదో తేదీన పోలింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే.
స్థానిక సంస్థల కోటా(local body mlc elections telangana 2021)లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా... తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 16 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువును నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించగా... డిసెంబరు 14న ఓట్లను లెక్కిస్తారు.