తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana latest news
టాప్​టెన్​ న్యూస్​@5PM

By

Published : Dec 30, 2020, 4:59 PM IST

కేటీఆర్ లేఖ

హైదరాబాద్ నగరంలో తలపెట్టిన సమగ్ర మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు, నాలాలా అభివృద్ధి పథకం, వరంగల్ మెట్రో సహా ఇతర పురపాలికల్లోని వివిధ పనుల కోసం రానున్న కేంద్ర బడ్జెట్​లో నిధులు కేటాయించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

న్యూ ఇయర్ గిఫ్ట్

నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల సమయాలను ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాల్లో అమ్మకాలను అనుమతిని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఏపీలో కూల్చుతారా?

శతాబ్దాల చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలోని బోధికొండపై ఉన్న కోదండరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఈటీవీ భారత్ ఎఫెక్ట్..

నాగర్‌కర్నూలు జిల్లా కృష్ణానదిలో మూగ జీవాల తరలింపుపై ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. కృష్ణా నదిలో మూగజీవాల తరలింపు ఘటనపై అధికారులు స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొత్త 'స్ట్రెయిన్'పై కేంద్రం లేఖ

భారత్​లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్​ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులకు లేఖ రాసింది కేంద్ర ఆరోగ్య శాఖ.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆకాశ్ క్షిపణి ఎగుమతి

ఆకాశ్ క్షిపణి వ్యవస్థను విదేశాలకు ఎగుమతి చేయాలని ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులకు సత్వర ఆమోదం తెలిపేలా కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

లాభాలే లాభాలు..

స్టాక్​ మార్కెట్ సూచీలు వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 133​ పాయింట్లు వృద్ధి చెంది 47,746 వద్ద ముగిసింది. నిఫ్టీ 49 పాయింట్లు మెరుగుపడి 13,981 వద్ద స్థిరపడింది. ఉదయం మందకొండిగా సాగిన సూచీలు అంతర్జాతీయంగా సానుకూల పవనాలతో చివర్లో లాభాల బాట పట్టాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

చైనా డేగ కన్ను

ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మందిని బలిగొన్న కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనానే అని చాలా దేశాలు విశ్వసిస్తున్నాయి. కానీ ఈ వైరస్‌ తమ దేశంలో పుట్టలేదని బుకాయించేందుకు డ్రాగన్‌ తన అధికార బలాన్ని విచ్చలవిడిగా వినియోగిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సిడ్నీ టెస్టులో..

భారత్-ఆసీస్​ మూడో టెస్టు సిడ్నీలోనే నిర్వహిస్తామని అయితే స్టాండ్స్​లో ప్రేక్షకులు సంబరాలు చేసుకోవద్దని ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్​ ధరించి, కొవిడ్​ నిబంధలను పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అక్షయ్​​కు రూ.135 కోట్లు?

హీరో అక్షయ్ తన పారితోషికాన్ని భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. గతంలో ఆ మొత్తం రూ.117 కోట్ల ఉండగా, ప్రస్తుతం రూ.135 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details