కరోనా తీవ్రతపై ఈటల ఫోన్...
కరోనా తీవ్రతపై మంత్రి ఈటల రాజేందర్ ఫోన్‌లో ఆరా తీశారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈ, డీహెచ్‌తో మంత్రి మాట్లాడారు. కేసులు పెరుగుతున్నా... తీవ్రత లేదని మంత్రికి అధికారులు వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కేసీఆర్ పీఎం అయితే..
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్.. ఒక్కసారి అయినా ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి. కేసీఆర్... పీఎం అయితే భారతదేశ రూపురేఖలు మారుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పొగిడేందుకే అసెంబ్లీ!
అసెంబ్లీ సమావేశాలను కేవలం అధికార పార్టీ వారిని పొగిడేందుకు మాత్రమే పెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే మైక్‌లు కట్ చేస్తున్నారని మండిపడ్డారు. చట్టసభల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'స్కీములు -స్కాములే'
బంగాల్ ప్రజలకు పథకాలు కావాలంటే మోదీకి ఓటు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. టీఎంసీకి ఓటు వేస్తే కుంభకోణాలే జరుగుతాయని ఆరోపించారు. బంగాల్లో ఉద్యోగాలను సృష్టించడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రూ.3,000 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత
మూడు అనుమానస్పద పడవుల్లో భారీ స్థాయిలో తరలిస్తున్న మత్తుపదార్థాలను ఇండియన్ కోస్టు గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.3,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.