తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ ​@5 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana latest news
టాప్​టెన్​ న్యూస్ ​@5 PM

By

Published : Feb 23, 2021, 4:58 PM IST

  • వైద్యరంగంలో ఏఐది కీలకపాత్ర

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బయో ఆసియా చర్చవేదికలో భాగంగా... మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. వైద్యరంగంలో ఏఐది కీలకపాత్ర అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెరాస నేతలతో కేటీఆర్​..

పార్టీ నేతలతో.. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సమావేశం నిర్వహించనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలు ఖరారుచేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉత్తరాఖండ్​ జలవిలయం మృతులు 90పైనే!

ఉత్తరాఖండ్​ ఛమోలీ జిల్లాలో సంభవించిన జల ప్రళయంలో.. మరో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు 70 శవాలతో పాటు 29 శరీర అవయవాలు.. తపోవన్​ సొరంగం నుంచి వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ఇవన్నీ కలిపితే మృతుల సంఖ్య 90 పైనే ఉంటుందని ఉత్తరాఖండ్​ డీజీపీ అశోక్​ కుమార్​ అంచనా వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టూల్​కిట్​ కేసులో దిశ రవికి బెయిల్

టూల్​కిట్​ కేసులో అరెస్టైన పర్యావరణ కార్యకర్త దిశ రవికి దిల్లీ పటియాలా హౌస్​ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు.. ఈ కేసు సహనిందితుడు శంతను ములుక్ ముందస్తు బెయిల్​ కోసం దిల్లీ కోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • '500 మీటర్ల దూరంలో భారత్​, చైనా సైన్యాలు'

బలగాల ఉపసంహరణకు ముందు ఎదురెదురుగా ఉన్న భారత్-చైనా దళాలు.. ప్రస్తుతం 500 మీటర్ల దూరాన్ని పాటిస్తున్నాయి. గల్వాన్ లాంటి ఘర్షణలు జరగకుండా ఈ చర్య దోహదం చేయనుంది. అయితే అరగంటలోనే మళ్లీ ఆ ప్రాంతానికి చేరుకునేలా సైన్యం మోహరింపులు ఉన్నాయని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఒంటరితనంపై పోరుకు ప్రత్యేక మంత్రి

జపాన్​లో ఆత్మహత్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దేశంలో అనేకమంది ఒంటరితనం, అందరికీ దూరంగా ఉండటం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మినిస్టర్​ ఆఫ్​ లోన్లీనెస్​ను నియమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి, వెండి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.337 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.1,149 పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఫ్లాట్​గా ముగిసిన మార్కెట్లు

స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు మంగళవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్​ అతిస్వల్పంగా 7 పాయింట్లు పెరిగి ఫ్లాట్​గా స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు పుంజుకుంది. ఐటీ షేర్లు రాణించాయి. ఆర్థిక షేర్లు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • లంక ఓపెనర్​ తరంగ గుడ్​బై

అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్​మెంట్​ ప్రకటించాడు శ్రీలంక క్రికెటర్​ ఉపుల్​ తరంగ. లంక జట్టుకు వన్డే కెప్టెన్​గానూ కొంతకాలం సేవలందించిన తరంగ.. తాజాగా క్రికెట్​కు వీడ్కోలు చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాలకృష్ణ సర్​ప్రైజ్

సినీ ప్రేక్షకులతో పాటు అభిమానులకు అగ్రహీరో బాలకృష్ణ సర్​ప్రైజ్ ఇచ్చారు. తన భీష్ముని పాత్రకు సంబంధించిన ఫొటోల్ని భీష్మ ఏకాదశి సందర్భంగా పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details