తెలంగాణ

telangana

ETV Bharat / city

వైద్య మౌలిక సదుపాయాలకు రుణం.. ఆరోగ్యశాఖ కసరత్తు - వైద్య ఆరోగ్య శాఖ

కరోనా నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్​లో మరో ఉపద్రవం ఎదురైనా తట్టుకోగలిగేలా ఆస్పత్రులను బలోపేతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ప్రస్తుత ఆస్పత్రులను ఆధునీకరించడమే గాక.. కొత్త ఆస్పత్రులు, ప్రయోగశాలల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం.. బడ్టెట్​లో నిధుల కేటాయింపుతో సంబంధం లేకుండా.. బ్యాంకుల నుంచి రణాలు తీసుకోవడం ద్వారా సొంతంగా నిధులను సమకూర్చుకోవాలని భావిస్తోంది.

Telangana Health Department Planning for loan hospitality
వైద్య మౌలిక సదుపాయాలకు రుణం.. ఆరోగ్యశాఖ కసరత్తు

By

Published : Oct 12, 2020, 10:02 AM IST

కరోనా నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్​లో మరో ఉపద్రవం ఎదురైనా తట్టుకోగలిగేలా ఆస్పత్రులను బలోపేతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ప్రస్తుత ఆస్పత్రులను ఆధునీకరించడమే గాక.. కొత్త ఆస్పత్రులు, ప్రయోగశాలల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇటీవల మంత్రులు కేటీఆర్​, ఈటల, ఎర్రబెల్లి, తలసాని పాల్గొన్న మంత్రివర్గ ఉపసంఘం భేటీలోను ఇదే అంశంపై చర్చించారు. కొవిడ్​ అనుభవాలను పరిగణనలోకి తీసుకొని.. ఆరోగ్య రంగంలో ఆధునిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వమిచ్చే నిధులుపైనే ఆధారపడకుండా.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందడంపై దృష్టి పెట్టాలి. తద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించవచ్చు. ఆరోగ్యశాఖ ఆస్తులనే పూచీకత్తు పెట్టవచ్చు. ప్రభుత్వం కూడా హామీ ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రుణాలను స్వీకరిస్తే.. తిరిగి తీర్చడమెలా అనే అంశం ప్రధానంగా చర్చకొచ్చాయి. అయితే.. ప్రభుత్వమే దశలవారిగా చెల్లించాలనే ఆలోచనలో ఉంది.

రుణాలు వేటివేటికి?

హైదరాబాద్​ చుట్టూ నాలుగు సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. నిమ్స్​లోనూ ఒక్కోటి ఏడంస్తులతో రెండు భారీ బహుళ అంతస్తుల భవనాలను నిర్మించాలని ప్రతిపాదించారి. వీటిలో ఒకదానిని ప్రత్యేకంగా మూత్రపిండాల వ్యాధుల కోసం కేటాయించాలని ప్రతిపాదించారు. ఉస్మానియా నూతన ఆస్పత్రిని కూడా బహుళ అంతస్తుల భవనంగా తీర్చి దిద్దాలని నిర్ణయించారు. ఈ నిర్మాణాల కోసం రుణాలు తీసుకోవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా నెదర్లాండ్స్​ చెందిన ఆర్థిక సంస్థతోనూ చర్చలు జరిపారు. అయితే వేర్వేరు కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత పరిణామాల్లో ఎయిమ్స్​, టిమ్స్​ ఏర్పాటు కావడం వల్ల హైదరాబాద్​ చుట్టూ మరో రెండు సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వీటితో పాటు.. నూతన ప్రతిపాదనలను కూడా.. దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సంస్థల నుంచి రుణాలను స్వీకరించాలని ఆరోగ్య శాఖ ఆలోచిస్తుంది. ఈ ప్రతిపాదనల రూపకల్పనపై కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది. ముందుగా అంశాల వారీగా ప్రతిపాదనలు రూపొందించి.. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన అనంతరమే ఎన్ని రూ.కోట్ల నిధులను రుణంగా పొందాలనే స్పష్టత వస్తుందని వైద్య వర్గాలు తెలిపారు.

ఇవీ చూడండి:కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్‌జీటీలో విచారణ

ABOUT THE AUTHOR

...view details