యాసంగి సీజను(Rabi season 2021)లో రైతులు వరి సాగు(Paddy cultivation) చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) రైతులను కోరుతోంది. యాసంగి(Rabi season 2021)లో వచ్చే ధాన్యంలో సింహభాగం ఉప్పుడు బియ్యానికే పనికొస్తాయి. గత యాసంగి(Rabi season 2021)కి సంబంధించి ఉప్పుడు బియ్యం తీసుకునే విషయంలో పెద్ద ప్రహసనం సాగుతున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో నీటి లభ్యతతోపాటు అదునులో వర్షాలు బాగా పడుతుండంతో వరి సాగు(Paddy cultivation) విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. గత యాసంగి(Rabi season 2021)లో అత్యధికంగా 54 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. 92 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దీని నుంచి 62 లక్షల టన్నుల బియ్యం వస్తాయి. కానీ కేంద్రం కేవలం 24.75 లక్షల టన్నుల బియ్యం మాత్రమే తీసుకుంటామని ప్రకటించింది. పలు దఫాల చర్చలు, ముఖ్యమంత్రి జోక్యంతో మరో 20 లక్షల టన్నులు తీసుకునేందుకు అంగీకరించింది. వచ్చే సీజను(Rabi season 2021)లో ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో వరి సాగు(Paddy cultivation) చేయవద్దు అని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరుతోంది. యాసంగి సీజను అక్టోబరు నుంచి ప్రారంభమవుతుంది.