సచివాలయంలోని ఆంధ్రాబ్యాంక్ శాఖను బీఆర్కే భవన్‌కు మర్చారు. బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఈ శాఖను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. తెలుగు ప్రజలు అతి దగ్గరగా భావించే బ్యాంక్ ఆంధ్రాబ్యాంక్ అని కొనియాడారు.
'ఆంధ్రాబ్యాంక్ విలీనం బాధాకరం' - హరీశ్‌రావు
హైదరాబాద్ బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఆంధ్రాబ్యాంకు శాఖను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
ఆంధ్రాబ్యాంక్ విలీనం బాధాకరం..!
ఆంధ్రాబ్యాంక్ విలీనం కొంత బాధాకరమన్నారు హరీశ్ రావు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు, మహిళల అభివృద్ధిలో ఏంతో కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. రాబోయేరోజుల్లో గ్రామాల్లో ఎక్కువ శాఖలు ఏర్పాటు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చూడండి : 'హుజూర్నగర్ అంటేనే తెరాస జంకుతోంది'