చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. చైనా నుంచి రాష్ట్రానికి వచ్చే వారిపై నిఘా పెట్టి... వైద్య పరీక్షలు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా... నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో 30 పడకలతో ఏడో వార్డు(ఐసోలేషన్)ను 'కరోనా' అనుమానితుల కోసం సిద్ధం చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ కె. శంకర్ తెలిపారు.
నగరంలో ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్లు అనుమానంతో... ముగ్గురి నుంచి శాంపిళ్లు సేకరించి పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఇద్దరికి సంబంధించి నెగిటివ్ వచ్చింది. వారిద్దరిని డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. మరొకరి రిపోర్టు రావాల్సి ఉంది. అప్పటి వరకు వారిని ఆసుపత్రిలోనే ఉంచనున్నారు.