హైదరాబాద్‌లో కేంద్ర వైద్య బృందం పర్యటించింది. చైనాతో పాటు ఇతర దేశాలనూ వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్‌లో కలకలం రేపడం వల్ల ఫీవర్, గాంధీ ఆస్పత్రులను కేంద్ర వైద్య బృందం పరిశీలించింది. కరోనా అనుమానితులకు చికిత్స, చేపట్టిన చర్యలను గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు బృంద సభ్యులు. కరోనా సోకిన రోగుల వార్డులు ఎలా ఉండాలి అనేదానిపై వైద్యులకు పలు సూచనలు చేశారు.
ఇవీ చూడండి: కాశీం అరెస్టుపై పోలీసుల కౌంటర్ దాఖలు.. శుక్రవారం వాదనలు