BK Parthasarathy on Lepakshi lands క్విడ్ ప్రోకో2లో భాగంగా లేపాక్షి భూముల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని తెదేపా సీనియర్ నేత బీకే పార్థసారథి ఆరోపించారు. జగన్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టే వేల కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని 500 కోట్లకే ఎర్తిన్ సంస్థకు కట్టబెట్టేందుకు బ్యాంకర్లు సిద్ధపడ్డారన్నారు. చౌకగా భూములు కట్టబెట్టేందుకు బ్యాంకర్లు ఎందుకు ఒప్పుకున్నారో, తెరవెనుక ఎవరున్నారో నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరగాలని డిమాండ్‌చేశారు.
"లేపాక్షి భూముల్ని సీఎం హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. సీఎం పాత్ర ఉంది కాబట్టే రూ.500 కోట్లకే ఇచ్చేందుకు బ్యాంకర్లు సిద్ధపడ్డారు. చౌకగా భూములు కట్టబెట్టేందుకు బ్యాంకర్లు ఎలా ఒప్పుకున్నారో. తెరవెనుక ఎవరున్నారో తేలాలంటే సీబీఐ విచారణ జరగాలి. సీఎం, విజయసాయి అండతోనే ఎర్తిన్ సంస్థ కొనుగోళ్లకు సిద్ధమైంది. లేపాక్షి భూముల్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం తప్పదు." -బీకే పార్థసారథి, ఏపీ తెదేపా సీనియర్ నేత