తెలంగాణ

telangana

Raithubandhu: కొత్తగా మరో 4.90లక్షల మందికి రైతుబంధు సొమ్ము

By

Published : Jun 19, 2021, 10:34 PM IST

వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత వల్ల రాష్ట్రం నేడు దేశానికే అన్నపూర్ణగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం కింద శనివారం 4.90 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,050.10 కోట్లను ప్రభుత్వం జమ చేసిందని పేర్కొన్నారు.

Distribution of raitubandu money to farmers
రైతుల ఖాతాలో రైతుబంధు డబ్బు జమ

రైతుబంధు పథకం కింద శనివారం 4.90 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,050.10 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 54.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ. 5,145.87 కోట్లు రైతులకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 3,97,260 మంది రైతులకు, అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 27,819 మంది రైతులకు లబ్ధిచేకూరినట్లు వెల్లడించారు.

నల్గొండ తర్వాత నాగర్​కర్నూల్​ జిల్లాలో అత్యధికంగా 2,35,549 మంది రైతులకు 254.62 కోట్ల రూపాయలు, మూడో స్థానంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలో 2,66,797 మంది రైతులకు రూ. 247.67 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని మంత్రి నిరంజన్​ రెడ్డి తెలిపారు. రైతుబంధు సాయంతో రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణం కారణంగా.. ఆకలి కేకల తెలంగాణ నేడు దేశానికి అన్నపూర్ణగా మారిందని అన్నారు. వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యత వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల గురించి విమర్శలు చేసే విపక్షాలు ముందు ఇంత ఉత్పత్తి ఎలా సాధ్యమైందో అర్థం చేసుకుని మాట్లాడాలని సూచించారు.

ఇదీ చదవండి:సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్ధమైన అధికార యంత్రాంగం

ABOUT THE AUTHOR

...view details