శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల చివరి రోజు శ్రీ భ్రమరాంబదేవి అమ్మవారు భక్తులకు నిజరూప అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను నంది వాహనంపై కొలువుదీర్చి అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను కళాకారుల సందడి నడుమ ఊరేగించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం నేత్ర శోభితంగా సాగింది. భక్తజన శివనామస్మరణ నడుమ దేవదేవుడైన స్వామి అమ్మవార్లు పుష్కరిణి జలాల్లో విహరించి పూజలందుకున్నారు.
నేత్ర శోభితం...శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మహోత్సవం
కర్నూలు శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దసరా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల చివరి రోజైన మంగళవారం స్వామి, అమ్మవార్లను నందివాహనంపై ఊరేగించారు. అనంతరం ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు.
శ్రీశైలంలో దసరా ఉత్సవాలు