తెలంగాణ

telangana

ETV Bharat / city

బడ్జెట్​ సమావేశాలపై అధికారులతో సభాపతి, మంత్రి చర్చలు - sc sk joshi

బడ్జెట్​ సమావేశాల నేపథ్యంలో సభాపతి పోచారం, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి ప్రశాంత్​రెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్​ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్ అధికారులతో భేటీ అయ్యారు.

బడ్జెట్​ సమావేశాలపై అధికారులతో సభాపతి, మంత్రి చర్చలు

By

Published : Sep 7, 2019, 5:36 PM IST

బడ్జెట్​ సమావేశాలపై అధికారులతో సభాపతి, మంత్రి చర్చలు

శాసనసభ సమావేశాల్లో బడ్జెట్‌కు సంబంధించిన అంశాలతోపాటు సభ్యులు అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానాలు ఇవ్వాలని అధికారులనుసభాపతి పోచారం శ్రీనివాస్​రెడ్డిఆదేశించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభాపతి పోచారం, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్​ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్, శాసనసభ కార్యదర్శి డా.నరసింహాచార్యులు అధికారులతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి, ప్రత్యేక సీఎస్​ అధర్ సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు అధికారులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details