కాలినడకన నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీల ఆకలి తీర్చడానికి కొంపల్లిలోని తెలంగాణ సిక్కు సొసైటీ ముందుకొచ్చింది. సంగారెడ్డి మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులకు, వారి పిల్లలకు ఆహార పొట్లాలు అందిస్తూ సొసైటీ ఆకలి తీరుస్తున్నది. గత ఐదు రోజుల నుంచి రోజూ వేలమంది వలస కార్మికుల ఆకలి తీరుస్తూ.. కష్టకాలంలో వారికి తోడుగా నిలిచింది. ఒక వాహనం సంగారెడ్డి మార్గంలో, మరో వాహనం జనగాం మార్గంలో ఏర్పాటు చేసి.. రహదారి గుండా కాలినడకన వెళ్లే వలస కార్మికులకు ఆహారం అందిస్తున్నారు. రోజూ వెయ్యి మందికి పైగా ఆహార పొట్లాలు పంచుతూ సొసైటీ చేస్తున్న మంచి పని గురించి తెలుసుకున్న ఎస్పీఎఫ్ డీజీ తేజ్ దీప్ కౌర్ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.
వలస కార్మికుల ఆకలి తీరుస్తున్న సిక్కు సొసైటీ - Sikh Society Distributes Food Packets To immigration labor
కరోనా వల్ల ఉపాధి లేక స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న.. కూలీలకు ఆకలి తీర్చేందుకు కొంపల్లిలోని తెలంగాణ సిక్కు సొసైటీ ముందుకొచ్చింది.
![వలస కార్మికుల ఆకలి తీరుస్తున్న సిక్కు సొసైటీ Sikh Society Distributes Food Packets To immigration labor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7008186-521-7008186-1588269938838.jpg)
వలస కార్మికుల ఆకలి తీరుస్తున్న సిక్కు సొసైటీ