తెలంగాణ

telangana

ETV Bharat / city

రూపాయి వైద్యురాలు జిజియా మృతి

దాదాపు ఆరు దశాబ్దాల పాటు చాలా తక్కువ ఫీజుతో పాలకొల్లులో వైద్యం చేసిన డాక్టర్​ జిజియా(88) ఇకలేరు. ఆమె హైదరాబాద్​లో గుండెపోటుతో మరణించారు.

senior-doctor-jijiya-died-with-heart-stroke
రూపాయి వైద్యురాలు జిజియా మృతి

By

Published : Aug 12, 2020, 10:57 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పాలకొల్లులో సీనియర్ వైద్యురాలు జిజియా గుండెపోటుతో హైదరాబాద్​లో మరణించారు. ఏడాది కిందటి వరకూ ఆమె వైద్యానికి ఒక రూపాయే తీసుకునేవారు. కొంతకాలం కిందట వైద్యం చేయడం మానేసేనాటికి 5 రూపాయలకు పెంచారు.

నాటి ప్రముఖ వైద్యులు డా. సౌభాగ్యాలక్ష్మి, మంగపతిరావు, విజయావాడ మాజీ మేయర్ డా.జంధ్యాల శంకర్, హృద్యోగ నిపుణులు డా.వెంకయ్య చౌదరి జిజియాకు సహాధ్యాయులే. జిజియా చెన్నైలో వైద్య విద్యనభ్యసించారు. జిజియా నాన్న 1940లో విశాఖపట్నం వైద్యం చేసేవారు. ఆమె అన్న మల్లిఖార్జునరావు తూర్పుగోదావరి డీఎంహెచ్​వోగా పనిచేశారు. జిజియా బహుముఖ ప్రజ్ఞాశాలి. చిత్రకారిణి, సంగీతంలో ప్రావీణ్యురాలు. ఆమె రాసిన రచనలు అనేక పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

ఇదీ చదవండి :ధ్వజ స్తంభం ఏర్పాటులో.. బోల్తా కొట్టిన క్రేన్​

ABOUT THE AUTHOR

...view details