ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హఠాన్మరణం.. కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఓ వైపు.. ఆయన ఉరి వేసుకుని బలవన్మరణం పొందారని వార్తలు వస్తుండగా.. మరోవైపు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్త విషయం చెప్పారు. ఉరి ప్రచారంలో వాస్తవం లేదని.. కోడెల మెడపై గాట్లు ఉన్నాయని అన్నారు. శవపరీక్ష కోసం కోడెల భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తామన్నారు సోమిరెడ్డి.
కోడెల మృతిపై సోమిరెడ్డి అనుమానం - కోడెల శివప్రసాదరావు
ఏపీ మాజీ సభాపతి, తెదేపా నేత కోడెల శివప్రసాదరావు మరణంపై.. మాజీ మంత్రి సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కోడెల మృతిపై సోమిరెడ్డి అనుమానం