తెలంగాణ

telangana

ETV Bharat / city

పబ్జీ ద్వారా అమ్మాయిని వేధించిన సల్మాన్​ ఖాన్ - salman khan harassed a minor girl in hyderabad

salman-khan-harassed-a-minor-girl-in-hyderabad
పబ్జీ ద్వారా అమ్మాయిని వేధించిన సల్మాన్​ ఖాన్

By

Published : Dec 28, 2019, 6:58 PM IST

Updated : Dec 28, 2019, 7:53 PM IST

18:56 December 28

పబ్జీ ద్వారా అమ్మాయిని వేధించిన సల్మాన్​ ఖాన్

 హైదరాబాద్​ టోలిచౌకీ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలిక గత కొంత కాలంగా పబ్జీ గేమ్​కు అలవాటు పడింది. నాంపల్లికి చెందిన బైక్ మెకానిక్ సల్మాన్ ఖాన్ (21)ఆటలో భాగంగా ఆన్​లైన్​లో పరిచయమయ్యాడు. చనువు పెరిగి బాలిక ఫోన్​ నెంబర్​ తీసుకున్న సల్మాన్, చాటింగ్ చేయడం ప్రారంభించాడు. బాలిక వ్యక్తిగత సమాచారాన్ని, ఫోటోలను వాట్సప్​ ద్వారా షేర్ చేయించుకున్నాడు. అనంతరం తన కోరిక తీర్చాలని బాలికను సల్మాన్ ఒత్తిడి చేశాడు. లేదంటే తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. మానసిక ఒత్తిడికి గురైన బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీనితో సదరు బాలిక తల్లిదండ్రులు సైబర్ క్రైం పోలీసులకు ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సల్మాన్ మొబైల్ నెంబర్ ఆధారంగా అరెస్ట్ చేసి, రిమాండ్​కు తరలించారు. అతన్ని కస్టడీకి తీసుకొని ఇంకా ఎవరినైనా ఈ విధంగా వేధించాడా అన్న కోణంలో విచారిస్తున్నట్లు సీసీఎస్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.

ఇవీ చూడండి: 'ఇలా చదువు చెప్తే పిల్లలు ఎలా పోటీనిస్తారు?'

Last Updated : Dec 28, 2019, 7:53 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details