ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌తో చర్చిస్తా: పవన్
ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌తో చర్చిస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సహా నేతలు ఆయన్ను కలిశారు.
ఆర్టీసీ సమ్మెకు మద్దతివ్వాలని జనసేనాని పవన్ కల్యాణ్‌ను జేఏసీ నేతలు కోరారు. దీనికి పవన్ సానుకూలంగా స్పందించారు. 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటం బాధ కలిగిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ మీద అపారమైన గౌరవం ఉందన్నారు. ప్రభుత్వం మొండిగా ఉండటం మంచిది కాదని తెలిపారు. రెండురోజుల్లో సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చిస్తానని అన్నారు. కేసీఆర్ వినని పక్షంలో ఆర్టీసీ ఐకాస భవిష్యత్ కార్యాచరణకు మద్దతిస్తామని భరోసానిచ్చారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యకు పాల్పొడొద్దని కోరారు.