కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ నిరసన బాటపట్టింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు కాంగ్రెస్ శ్రేణులు ప్రదర్శనగా బయల్దేరారు. అనంతరం గవర్నర్ తమిళిసైను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్ నుంచి వారు బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
అరెస్టు చేశారు.. బేగం బజార్ పీఎస్ తరలించారు...
పోలీసు వలయాన్ని నెట్టుకొని ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. విడతలవారీగా కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేతలను అరెస్టు చేశారు. వీరందరిని బేగం బజార్ పోలీస్ స్టేషన్ తరలించారు. గాంధీభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
అనుమతి కోరాం.. పోలీసులు పట్టించుకోలేదు