తెలంగాణ

telangana

ETV Bharat / city

Pulichintala Gate: ఏడు ఎలిమెంట్లను అమర్చిన నిపుణులు - పులిచింతల ప్రాజెక్టు

పులిచింతల ప్రాజెక్టులో కొట్టుకుపోయిన 16వ నంబర్ గేట్ ఈ రోజు ఉదయం ప్రాజెక్టుకు అరకిలోమీటర్ దూరంలో కనబడింది. రెండు రోజుల క్రితం వరద దాటికి గేటు కొట్టుకుపోయింది.

Pulichintala Gate
Pulichintala Gate

By

Published : Aug 7, 2021, 10:29 PM IST

ఏడు ఎలిమెంట్లను అమర్చిన నిపుణులు

పులిచింతల వద్ద వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన 16వ నంబర్ క్రస్ట్‌ గేటు ఈ రోజు ఉదయం ప్రాజెక్టుకు అర కిలోమీటర్ దూరంలో లభ్యమైంది. పులిచింతల ప్రాజెక్టులో ఆగస్టు 5న తెల్లవారుజామున 16వ నంబర్ గేటు ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయింది.

పులిచింతల డ్యాంలో విరిగిన గేటు స్థానంలో స్టాప్‌లాక్‌ ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు, ఇంజినీరింగ్ నిపుణుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మూడు స్టాప్ గేటుకు సంబంధించి 3 ఎలిమెంట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 11 ఎలిమెంట్లు అమర్చనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 15 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి 58 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ 5 టీఎంసీలుగా ఉంది. నీటి మట్టం 53 మీటర్ల నుంచి 38.20 మీటర్లకు పడిపోయింది.

అసలేం జరిగింది..

ప్రాజెక్టుకు ఇన్​ఫ్లో అధికంగా ఉండటంతో కొంతమేర గేటు పైకి ఎత్తే క్రమంలో గాటర్స్​లో సాంకేతిక సమస్య వల్ల 16 నంబర్ గేటు ఊడిపోయింది. దీనివల్ల ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోతోంది. లోతట్టు ప్రాంతాలైన మాదిపాడు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సూచించారు. పులిచింతల డ్యాం 16వ గేట్ సాంకేతిక సమస్యతో ఊడిపోయిందని ఆయన తెలిపారు.

ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ష్ ఫ్లడ్ చేరనున్నట్లు తెలిపారు. అధికారులు, నదిపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆదేశించారు. పులిచింతల డ్యాం వద్ద ప్రస్తుతం ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులు ఉండగా, ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఔట్ ఫ్లో 33,750 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో 41,717 క్యూసెక్కులు ఉందన్నారు. వాగులు, వంకలు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని కలెక్టర్ సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details