శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించారు. ఫిల్మ్‌సిటీని అద్భుత సందర్శనా ప్రదేశంగా అభివర్ణిస్తూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు. అనేక సంవత్సరాలుగా ఇక్కడ వందల సంఖ్యలో సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయని తెలిపిన రామ్‌నాథ్.... అనేక భాషల్లో గొప్ప చిత్రాలు, సీరియళ్ల నిర్మాణానికి రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికైందని తెలిపారు. అచ్చమైన మినీఇండియాకు రామోజీ ఫిల్మ్‌సిటీ గొప్ప నిదర్శనమని కొనియాడారు. గొప్ప గొప్ప కళాకారులు, నిర్మాతలు, దర్శకుల సృజన, శ్రమకు ఫిల్మ్‌సిటీ సాక్ష్యంగా నిలిచిందని రామ్‌నాథ్ ప్రశంసించారు.
రామోజీ ఫిల్మ్‌సిటీ ఓ అద్భుత సందర్శనా ప్రదేశం: రాష్ట్రపతి - రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించిన రాష్ట్రపతి కోవింద్
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యాటకుల స్వర్గధామమైన రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించారు. ఫిల్మ్‌సిటీ ఒక అద్భుత సందర్శనా ప్రదేశంగా కొనియాడారు.
రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించిన రాష్ట్రపతి కోవింద్