తెలంగాణ

telangana

'పోస్టర్​ బ్యాలెట్​ ఛార్జీలు జీహెచ్​ఎంసీనే చెల్లిస్తుంది'

By

Published : Nov 26, 2020, 7:02 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు పోస్టల్​ బ్యాలెట్​ను పంపే ఓటర్లు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదని అధికారులు తెలిపారు. ఆ ఛార్జీలను జీహెచ్​ఎంసీనే చెల్లిస్తుందని పేర్కొన్నారు. బ్యాలెట్​ను పంపేందుకు పోస్టల్​ స్టాంప్​ కూడా అవసరంలేదని తెలిపారు.

postal ballot charges paid by ghmc
postal ballot charges paid by ghmc

పోస్టల్ బ్యాలెట్​లకు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ అధికారి లోకేశ్​ కుమార్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్​ను పంపే ఓటర్లకు ఆ ఛార్జీలను జీహెచ్ఎంసీ చెల్లిస్తుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లను ఆర్వోకు అందించేందుకు పోస్టల్ స్టాంపులు అవసరం లేదన్నారు.

పోస్టల్ శాఖకు బీఎన్పీఎల్ అకౌంట్ నంబర్ 2019, కస్టమర్ ఐడీ 6000014601 ద్వారా జీహెచ్ఎంసీ పోస్టల్ వ్యయాన్ని చెల్లిస్తుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఉన్న ఎన్వలప్​ మీద బీఎన్పీఎల్ అకౌంట్ నంబర్, కస్టమర్ ఐడీ రాయాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'ప్రచారాల్లో వ్యక్తిగత దూషణలను తీవ్రంగా పరిగణిస్తాం'

ABOUT THE AUTHOR

...view details