తెలంగాణ

telangana

ETV Bharat / city

'సొంత జిల్లా వాసుల కష్టాలు సీఎం కేసీఆర్​కు పట్టవా'

తెరాస సర్కార్​పై పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆయన సీఎస్​కు వినతి పత్రం అందజేశారు. సొంత జిల్లా వాసుల కష్టాలు ముఖ్యమంత్రికి పట్టవా అని ప్రశ్నించారు.

By

Published : Feb 24, 2020, 7:43 PM IST

ponnala request for special revenue division for cheryala
చేర్యాలను ప్రత్యేక రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని పొన్నాల డిమాండ్

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిద్దిపేట జిల్లా చేర్యాలను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. చేర్యాల ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారని, ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఒంటెద్దు పోకడలు సరికాదు..

రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతోందని పొన్నాల ఆక్షేపించారు. జిల్లాల విభజన, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. సొంత జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి స్పందించరా? అని ప్రశ్నించారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం తమ తదుపరి కార్యాచరణ తర్వలోనే ప్రకటిస్తామని తెలిపారు.

చేర్యాలను ప్రత్యేక రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని పొన్నాల డిమాండ్

ఇవీ చూడండి:ఆపరేషన్ వీడియో టిక్​టాక్​లో ప్రత్యక్షం.. వైద్యుడి వివరణ

ABOUT THE AUTHOR

...view details