పుర ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల సంఖ్య ఖరారు పురపాలక ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల సంఖ్య ఖరారైంది. ఈ మేరకు తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పది నగరపాలక సంస్థల్లోని 385 వార్డులకు గానూ 1786 పోలింగ్ కేంద్రాలున్నాయి. నిజామాబాద్ నగర పాలకసంస్థలో ఎక్కువ సంఖ్యలో 411 కేంద్రాలు ఉండగా... కరీంనగర్లో 348, రామగుండంలో 242 చోట్ల ఓటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. తక్కువ సంఖ్యలో బండ్లగూడ జాగీర్‌లో కేవలం 85 పోలింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. 120 పురపాలక సంస్థల్లోని 2727 వార్డులకుగానూ 6325 పోలింగ్ కేంద్రాలున్నాయి.
కరీంనగర్లో 24న పోలింగ్
పురపాలికల్లో అత్యధికంగా మహబూబ్ నగర్లో 240 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఆదిలాబాద్‌లో 183, నల్గొండలో 180, సూర్యాపేటలో 146, మిర్యాలగూడలో 144 పోలింగ్ కేంద్రాలున్నాయి. తక్కువ సంఖ్యలో డోర్నకల్, వర్ధన్నపేట, కొత్తపల్లి, ధర్మపురిలో కేవలం 15 చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 22న తొమ్మిది కార్పొరేషన్లలోని 1438 పోలింగ్ కేంద్రాలు,120 పురపాలికల్లోని 6325 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. కరీంనగర్ కార్పొరేషన్‌లోని 348 పోలింగ్ కేంద్రాల్లో 24వ తేదీన పోలింగ్ జరగనుంది. 25న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: మున్సిపల్ వార్‌లో యువత బస్తీమే సవాల్