Poisonous Fish: మనిషి మోమును పోలిన రూపంతో కనిపిస్తున్న అరుదైన ఈ మీనాన్ని బొంక చేపని పిలుస్తారు. దీనికి పఫర్ ఫిష్, బెలూన్ ఫిష్, గ్లోబ్ ఫిష్ అని కూడా పేర్లున్నాయి. ఈ ఫిష్ సాధారణంగా మామూలు చేపలానే ఉంటుంది. కానీ దాన్ని ఎవరైనా తాకినా, ప్రమాద సంకేతాలు కనిపించినా గాలి పీల్చుకుని బంతిలా ఉబ్బుతుంది. ఈ చేప తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని వాసాలతిప్ప వద్ద మత్స్యకారుల వలకు ఇది చిక్కింది.
Poisonous Fish: మనిషి ముఖం చేప.. చంపేంత విషపూరితం
Poisonous Fish: అదొక వింతైన... విషపూరితమైన చేప. ఆ మీనం చూసేందుకు అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉంటుంది. మామూలుగానే కనిపించినా.. ఎవరైనా తాకారా... బంతిలా ఉబ్బుతుంది. దీనిలో మనిషిని సైతం చంపేంత విషం ఉంటుందట.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో మత్య్సకారుల వలకు చిక్కింది.
Poisonous Fish
ఈ చేప టెట్రాడాంటిడీ కుటుంబానికి చెందినదని... దీని శాస్త్రీయనామం టెట్రాడాన్ అని.. దీని గురించి ఉప్పలగుప్తం మత్స్యశాఖాధికారి గోపాలకృష్ణ వివరించారు. ఈ వింత చేప.. ప్రపంచంలోకెల్లా రెండో విషపూరితమైన చేపని, దీనిలో విషం మనిషిని చంపేంత ఉంటుందని తెలిపారు.