ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లా అరకు ప్రాంతంలోని చల్లని వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్గానిక్ స్ట్రాబెర్రీని పండిస్తున్నారు. స్ట్రాబెర్రీ సాగుతో ఆర్థికంగానూ అభివృద్ధి చెందుతున్నారు. అరకు సందర్శనకు వచ్చే పర్యటకులు ఈ స్ట్రాబర్రీని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. స్థానిక నగరం విశాఖ సహా విజయవాడ వంటి ప్రాంతాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. స్ట్రాబెర్రీని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
అరకులో ఆర్గానిక్ స్ట్రాబెర్రీ... రైతులకు ఆదాయం - latest news of araku
అరకు అంటేనే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ప్రకృతి అందాలు, కాఫీ తోటలు. వీటితోపాటు నోరూరించే స్ట్రాబెర్రీ పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. ఆర్గానిక్ సేద్యం చేస్తున్న స్ట్రాబెర్రీపై మీరూ ఓ లుక్కేయండి మరి.
అరకులో ఆర్గానిక్ స్ట్రాబెర్రీ సాగు