తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం - ఏపీ వాతావరణం

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. రాగల 12 గంటల్లో తుపాన్​గా బలపడనుందని వాతావరణ అధికారులు తెలిపారు.

cyclone
cyclone

By

Published : Dec 1, 2020, 10:16 PM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. రేపు రాత్రి శ్రీలంక దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రేపు, ఎల్లుండి ఏపీ దక్షిణ కోస్తాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని... మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details