తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈఎస్​ఐ కేసు: తవ్వే కొద్దీ వెలుగులోకి కొత్త విషయాలు..!

ఈఎస్​ఐ మందుల కుంభకోణంలో ఓమ్ని మెడి సంస్థ యజమాని శ్రీహరిబాబు పేరుతో రూ. 99 కోట్ల షేర్లు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. వీటితో పాటు ఆయన పేరుపై రూ.24 కోట్లు, భార్య పేరిట ఏడు కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు అధికారులు గుర్తించారు.

New things to emerge ..!
తవ్వే కొద్ది.. వెలుగులోకి కొత్త విషయాలు..!

By

Published : Jan 2, 2020, 11:35 PM IST

తవ్వే కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్య పరీక్ష కిట్లను వాస్తవ ధర కంటే 60 శాతం పెంచి విక్రయించారని, ఐఎంఎస్‌ అధికారులు, శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జి కుమ్మక్కై నిధులు కొల్లగొట్టారని ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఏసీబీ ఇటీవల జరిపిన దాడుల్లో బాబ్జి వద్ద 130 కోట్ల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో కేవలం చక్కెర, తెల్లరక్తకణాలు లెక్కించే స్ట్రిప్‌ల కొనుగోళ్లలోనే రూ.54 కోట్ల మిగులు చెల్లింపులు బయటపడ్డాయి.

అక్రమాస్తుల స్వాధీనంపై తర్జనభర్జన

అవినీతి కేసుల్లో అక్రమాస్తులు గుర్తించినప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధికారులు ఈ విషయంలో న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. న్యాయ విచారణ పూర్తయిన తర్వాత న్యాయస్థానం తీర్పుకనుగుణంగా ఆస్తులపై తుది నిర్ణయం తీసుకుంటారు. స్టాక్‌ మార్కెట్‌లో ఉన్న షేర్లపై తీసుకోవాల్సిన నిర్ణయంపై ఇంకా ఏసీబీ అధికారులు స్పష్టతకు రాలేదని తెలుస్తోంది.

ఇక్కడ లాగితే.. అక్కడ తేలింది..?

ఈ కుంభకోణంలోని సూత్రధారులు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే తరహాలో అక్రమాలకు పాల్పడ్డారని విచారణ అధికారులు అనుమానిస్తున్నారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఆ రాష్ట్ర అధికారులతో పంచుకోవాలని భావిస్తున్నారు.

ఇవీ చూడండి: ఐఎంఎస్​ కుంభకోణంలో ఇంటి దొంగ గుట్టురట్టు

ABOUT THE AUTHOR

...view details