గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,758 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 2,224 మందికి కరోనా సోకింది. వైరస్ కారణంగా మరో 31 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. కొవిడ్ నుంచి మరో 4,714 మంది బాధితులు కోలుకోగా... రాష్ట్రంలో ప్రస్తుతం 42,252 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
corona cases: ఏపీలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 2,224 కేసులు
ఏపీలో కొత్తగా 2,224 కరోనా కేసులు, 31 మరణాలు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. వైరస్ బారి నుంచి మరో 4,714 మంది కోలుకోగా.. ప్రస్తుతం 42,252 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కొత్తగా 2,224 కేసులు
మహమ్మారితో చిత్తూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 5, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 409, తూర్పుగోదావరి జిల్లాలో 299, పశ్చిమగోదావరి జిల్లాలో 259, కృష్ణా జిల్లాలో 222 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండి:TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు, 9 మరణాలు