రోడ్డు ప్రమాదాల కంటే ముందుగా అవి ఏ విధంగా జరుగుతున్నాయనే విషయంపై అందరికీ అవగాహన ఉండాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని రాచకొండ పోలీసులు 'వుయ్ వాంట్ యూ సేఫ్' పేరుతో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని వైద్యశాల ఆడిటోరియంలో శనివారం రోడ్డు ప్రమాదాలపై అవగాహన నిర్వహించారు.
'నిర్లక్ష్యం... అతివేగమే... రోడ్డు ప్రమాదాలకు కారణం' - Kamineni_Hospital_LB Nagar
నిర్లక్ష్యంతో అతివేగంగా వాహనాలు నడపడం వల్లే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి ఆడిటోరియంలో రోడ్డు ప్రమాదాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
!['నిర్లక్ష్యం... అతివేగమే... రోడ్డు ప్రమాదాలకు కారణం' Awareness on Road Safety](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5923771-18-5923771-1580559981124.jpg)
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ హాజరై ప్రసంగించారు. నిర్లక్ష్యంతో అతివేగంగా వాహనాలు నడపడం వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని... అందరూ విధిగా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు. ద్విచక్ర వాహన చోదకులు శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలని, వెనక కూర్చున్నవారూ హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, డ్రైవర్లు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: బడ్జెట్ సమావేశంలో మంత్రి నిర్మల కశ్మీరీ కవిత