తెలంగాణ

telangana

ETV Bharat / city

జాతీయ నృత్యోత్సవంలో తెలంగాణ ఆట - chattisgarh government

ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలో నేటి నుంచి జాతీయ గిరిజన నృత్యోత్సవాలు ప్రారంభమయ్యాయి. నృత్యోత్సవంలో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గిరిజన కళాకారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి హాజరైన గిరిజన కళాకారులు తమ నృత్యాలతో అబ్బురపరిచారు.

చత్తీస్ ఘడ్​ నృత్యోత్సవంలో తెలంగాణ గిరిజనలు
చత్తీస్ ఘడ్​ నృత్యోత్సవంలో తెలంగాణ గిరిజనలు

By

Published : Dec 27, 2019, 7:57 PM IST

ఛత్తీస్​గఢ్రాజధాని రాయ్ పూర్​లో జాతీయ గిరిజన కళాకారుల నృత్యోత్సవం నిర్వహించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబురాలకు రాష్ట్రం నుంచి గిరిజన కళాకారుల బృందం పాల్గొంది. నృత్యం ద్వారా గిరిజన సంస్కృతిని చాటేందుకే ఇక్కడకు వచ్చామని తెలంగాణ గిరిజన కళాకారులు తెలిపారు. గిరిజన నృత్యకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

గిరిజన సంస్కృతిని చాటేందుకే...

గిరిజనుల సంప్రదాయాలను చాటి చెప్పడమే లక్ష్యంగా రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని అధికారులు వెల్లడించారు. 2,500 మందికిపైగా నృత్య కళాకారులు ఈ ఉత్సవానికి వస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 29న రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన ఛత్తీస్‌ ఘడ్ ప్రభుత్వం... ఐక్యత సందేశాన్ని ఇచ్చిందని ప్రదర్శకారులు కొనియాడారు.

చత్తీస్ ఘడ్​ నృత్యోత్సవంలో తెలంగాణ గిరిజనలు

ఇవీ చూడండి : గిరిజన పండుగలో ప్రత్యేక ఆకర్షణగా 'రాహుల్ నృత్యం'

ABOUT THE AUTHOR

...view details