తెలంగాణ

telangana

ETV Bharat / city

'పుర' పోలింగ్ ముగిసింది.. ఫలితమే మిగిలింది - పురపోరు

పురపాలక ఎన్నికలు పోలింగ్ ముగిశాయి. చెదురు మదురు ఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించారు.

muncipal-elections-are-over-in-telangana
రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పురపోరు

By

Published : Jan 22, 2020, 5:46 PM IST

'పుర' పోలింగ్ ముగిసింది.. ఫలితమే మిగిలింది

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​ ముగిసింది. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా.. పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. 120 పురపాలక, 9నగరపాలికల్లో బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం ఈనెల 25న తేలనుంది.

కరీంనగర్​ నగరపాలక ప్రచార గడువు ముగిసింది. 60 కార్పొరేటర్ స్థానాలకు ఈనెల 24న పోలింగ్ జరగనుంది. ఈనెల 27న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: తెరాస అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

ABOUT THE AUTHOR

...view details