RRR Complaint To Lok Sabha Speaker:లోక్‌సభలో వైకాపా ఎంపీ నందిగం సురేశ్ తనను అసభ్య పదజాలంతో దూషించారని అదే పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో అమరావతి రైతులపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్న దాడుల గురించి మాట్లాడుతున్న సమయంలో నందిగం సురేశ్ అసభ్య పదజాలంతో దూషించారన్నారు. రాష్ట్రానికి చెందిన ఒక ప్రధానమైన అంశాన్ని లేవనెత్తితే.. ప్రజా బాహుళ్యంలో పలకలేని రీతిలో దూషిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సభ్యుడిగా తనకు ఉన్న హక్కును హరించే రీతిలో వ్యవహరించిన బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై ప్రివిలేజ్ నోటీసును స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చినట్లు తెలిపారు.
RRR Complaint To LS Speaker: 'ఆ అంశంపై మాట్లాడుతుంటే నన్ను దూషించారు.' - రఘురామ తాజా వార్తలు
RRR Complaint To Lok Sabha Speaker: లోక్‌సభలో వైకాపా ఎంపీ నందిగం సురేశ్ తనను అసభ్య పదజాలంతో దూషించారని అదే పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు.. స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. అన్ని రికార్డులు పరిశీలించి.. వెంటనే తగిన చర్యలు తీసుకుని, సభా గౌరవాన్ని కాపాడాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.
ఎంపీ రఘురామ కృష్ణ రాజు
ఇలాంటి వ్యవహారంపైనే ఏడాది క్రితం ఒక ఫిర్యాదు ఇచ్చినా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో.. దాన్ని అలుసుగా తీసుకుని ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ని రికార్డులు పరిశీలించి..వెంటనే తగిన చర్యలు తీసుకుని, సభా గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:Etela Jamuna Comments: గతంలో లేనిది ఇప్పుడే ఆక్రమించుకున్నారా?