తెలంగాణ

telangana

ETV Bharat / city

సుప్రీంకు ఎంపీ రఘురామ వైద్య పరీక్షల నివేదిక

ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్​లోని మిలటరీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈ మేరకు మెడికల్​ బోర్డు నివేదిక సహా వీడియో ఫుటేజీని తెలంగాణ హైకోర్టు.. సీల్డ్ కవర్​లో సుప్రీంకోర్టుకు పంపింది. సుప్రీం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న రఘురామకు ఇక్కడే చికిత్స అందిస్తామని సికింద్రాబాద్‌ సైనికాసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

mp raghurama news
సుప్రీంకు ఎంపీ రఘురామ వైద్య పరీక్షల నివేదిక

By

Published : May 19, 2021, 5:10 AM IST

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై సికింద్రాబాద్‌లోని సైనిక ఆస్పత్రిలో నిర్వహించిన వైద్యపరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు సీల్డ్‌కవర్‌లో సుప్రీంకోర్టుకు పంపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ముగ్గురు వైద్యుల బృందం రఘురామను పరీక్షలు చేసింది. వైద్యపరీక్షలను అధికారులు వీడియో తీయించి సీల్డ్‌ కవర్‌లో భద్రపరిచారు. పర్యవేక్షణకు తెలంగాణ హైకోర్టు జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ డి.నాగార్జున్‌ నియమితులయ్యారు. వైద్యాధికారుల నివేదికను జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ హైకోర్టుకు అందజేశారు. డాక్టర్ల నివేదికతోపాటు.. వీడియో ఫుటేజిీని సీల్డ్‌కవర్‌లో సుప్రీంకోర్టుకు మంగళవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు పంపింది.

ఎంపీ కుమారుడు భరత్‌ దాఖలుచేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం ఎంపీకి రక్త, చర్మ, ఇతర పరీక్షలు నిర్వహించారు. బయటి నుంచి చర్మవ్యాధి నిపుణుడిని రప్పించి పరీక్షించినట్లు తెలిసింది. ఇక్కడి నుంచి వెళ్లిన నివేదికను సుప్రీంకోర్టు శుక్రవారం పరిశీలించనుంది. వైద్యపరీక్షల నిర్వహణ నుంచి నివేదిక పంపడం వరకు అంతా రహస్యంగానే కొనసాగింది. సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న రఘురామకృష్ణరాజుకు ఇక్కడే చికిత్స అందిస్తామని సికింద్రాబాద్‌ సైనికాసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్య పరీక్షలు అన్నీ కొవిడ్‌ నిబంధనల మేరకు నిర్వహించినట్లు తెలిపాయి.

కుమారుడినీ అనుమతించని సైనికాధికారులు

రఘురామకృష్ణరాజును కలిసేందుకు ఆయన తనయుడు భరత్‌ మంగళవారం మధ్యాహ్నం సైనికాసుపత్రి వద్దకు వచ్చారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సైనికాధికారులు అనుమతించలేదు. కాసేపు వేచిచూసి నిరాశతో వెనుదిరిగారు. మీడియా సిబ్బందిని ఆస్పత్రికి 500 మీటర్ల దూరంలోనే నిలిపివేశారు.

ఇవీచూడండి:సుప్రీం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సైనిక ఆస్పత్రిలోనే రఘురామకృష్ణరాజు

ABOUT THE AUTHOR

...view details