తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్‌సాగర్‌లో దూకిన తల్లీకొడుకు - mother and sun sucide attempt

ఆర్థిక ఇబ్బందులతో... కుమారుడితో ఓ మహిళ హుస్సేన్‌సాగర్‌లో దూకింది. తల్లి మృతి చెందగా... కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిట్టీల వ్యాపారంలో నష్టాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.చ

ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్‌సాగర్‌లో దూకిన తల్లీకొడుకు
ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్‌సాగర్‌లో దూకిన తల్లీకొడుకు

By

Published : Dec 20, 2019, 6:05 AM IST

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ తల్లీకొడుకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లి రాణి మృతి చెందగా... కుమారుడు హీరానంద కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాంగోపాల్‌ పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రాణి అనే మహిళ కుమారుడితో కలిసి నివాసం ఉంటోంది. రాణి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. వ్యాపారంలో నష్టపోయి మానసిక వేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాత్రి 10 గంటలకు చోటుచేసుకున్నట్లు తెలిపారు. రాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఆర్థిక ఇబ్బందులతో హుస్సేన్‌సాగర్‌లో దూకిన తల్లీకొడుకు

ABOUT THE AUTHOR

...view details